టీడీపీలో హాట్ టాపిక్‌గా సునీల్‌… ఈ సారి సైకిల్ విక్ట‌రీ ప‌క్కా…!

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టున్న స్థానమే..ముఖ్యంగా బల్లి దుర్గాప్రసాద్‌కు అండగా ఉన్న స్థానం…ఆయన నాలుగు సార్లు టి‌డి‌పి నుంచి గెలిచారు. 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో గెలిచారు. ఇక ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక బల్లి అటు వెళ్ళడంతో గూడూరులో టి‌డి‌పి పరిస్తితి ఇబ్బందికరంగా మారింది. ఇదే క్రమంలో 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన పాశం సునీల్ కుమార్‌ని టీడీపీలోకి తెచ్చుకున్నారు.

Gudur MLA Pasim Sunil Kumar over action on local peeople - Sakshi

దీంతో టి‌డి‌పికి కాస్త ప్లస్ అయిందని అంతా అనుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో సునీల్ దారుణంగా ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన వరప్రసాద్ 45 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఆయన అంత మెజారిటీతో గెలవడానికి కారణం కేవలం జగన్ ఇమేజ్, వైసీపీ నుంచి టి‌డి‌పిలోకి వచ్చారని సునీల్ పై ఉన్న ఆగ్రహం..అంతే తప్ప అక్కడ వరప్రసాద్ కు పర్సనల్ ఇమేజ్ లేదు. పోనీ గెలిచాక అయినా వరప్రసాద్ సరిగ్గా పనిచేసి ఇమేజ్ పెంచుకుంటున్నారా ? అంటే అది లేదు.

అసలు వైసీపీ ఎమ్మెల్యేల్లో దారుణమైన వ్యతిరేకత వచ్చిందే గూడూరు ఎమ్మెల్యేకే…ప్రజల్లో లేకపోవడం, అక్రమాలు ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆఖరికి సొంత పార్టీ వాళ్లే వరప్రసాద్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్తితుల నేపథ్యంలో టి‌డి‌పికి అడ్వాంటేజ్ అవుతుంది. అదే సమయంలో మొదట్లో కాస్త యాక్టివ్ గా పనిచేయకపోయినా..నిదానంగా టి‌డి‌పి ఇంచార్జ్ సునీల్ కుమార్ దూకుడుగా పనిచేస్తూ వస్తున్నారు.

YSRCP MLA Varaprasad terribly insulted..? - TeluguBulletin.com

టి‌డి‌పి కార్యక్రమాలని విజయవంతంగా అమలు చేస్తున్నారు..ప్రజల్లో ఉంటున్నారు. ఇక తాజాగా టి‌డి‌పి ఇంచార్జ్ ల్లో మంచి పనితీరు కనబరుస్తున్న వారిలో సునీల్ కూడా ఉన్నారు. ఇంకా కొంచెం కష్టపడితే గూడూరులో టి‌డి‌పి గెలవడం ఖాయమే. మొత్తానికి వైసీపీకి అనుకూలంగా ఉండే గూడూరుని సునీల్ టి‌డి‌పికి అనుకూలంగా మారుస్తున్నారు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp