బైరెడ్డి కోటలో టీడీపీకి పెద్ద‌ షాకింగ్ న్యూస్ ఇది…!

రాష్ట్రంలో టీడీపీ వేగంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీని ఢీకొట్టే విధంగా టి‌డి‌పి బలపడుతూ వస్తుంది. అయితే చాలా స్థానాల్లో టి‌డి‌పి రేసులోకి వచ్చింది. కానీ ఇంకా కొన్ని స్థానాల్లో పార్టీ వెనుకబడింది. ఇంకా చెప్పాలంటే కొన్ని స్థానాల్లో అయితే అసలు టి‌డి‌పి ఉందా? అనే పరిస్తితి ఉంది. అలాంటి పరిస్తితి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో ఉంది. అసలు ఇక్కడ టి‌డి‌పికి సరైన నాయకుడు లేరు.

All Is Not Well For Byreddy Siddharth Reddy In YSRCP?

వరుసగా ఓడిపోతున్నా సరే బలమైన నాయకుడుని పెట్టలేదు. దీని వల్ల నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి ఓడిపోతుందా అనే పరిస్తితి. ఓడిపోతుందా ఏముంది ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇక్కడ వైసీపీ హవా నడవటానికి కారణం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి..ఆయన వల్ల వైసీపీకి పట్టు ఉంది. ఎస్సీ స్థానమైన సరే..అక్కడ నిలబడే నాయకుడు గెలవాలంటే బైరెడ్డి సపోర్ట్ కావాలనే పరిస్తితి. వాస్తవానికి ఇక్కడ బైరెడ్డి ఫ్యామిలీ హవా ఎక్కువ.

రిజర్వ్‌డ్ కాకముందు బైరెడ్డి శేషా సాయన రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టి‌డి‌పి నుంచి గెలిచారు. ఇక టి‌డి‌పి చివరిగా గెలవడం 1999 ఎన్నికల్లోనే..2004లో కాంగ్రెస్ గెలిచింది. 2009ల ఎస్సీ స్థానంగా మారింది..అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇక్కడ అభ్యర్ధి ఎవరైనా సరే గెలుపు వైసీపీదే…బైరెడ్డి సునాయసంగా గెలిపించేస్తారు.

Nandikotkur, Kurnool : నందికొట్కూరు: పురపాలక సంఘాల ఎన్నికలకు మార్చి 2 నుంచి  నామినేషన్ ఉపసంహరణ: కమిషనర్ అంకిరెడ్డి | Public App

అయితే ఇక్కడ టి‌డి‌పి బాధ్యతలు గౌరు వెంకటరెడ్డి చూసుకుంటున్నారు..కానీ అనుకున్న మేర బలోపేతం చేయలేదు. ఇక ఇక్కడ టి‌డి‌పి నుంచి ఎవరు నిలబడతారో ఇప్పటికీ క్లారిటీ లేదు. దీని వల్ల టి‌డి‌పి వెనుకబడే ఉంది. మరొకసారి ఇక్కడ టి‌డి‌పి గెలవడం జరిగే పని కాదని తెలిసిపోతుంది.

Tags: AP, ap politics, birredy, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp