‘ బ్రో ‘ సినిమాలో ‘ పృథ్వి శ్యాంబాబు ‘ రోల్‌తో ఆ ఏపీ మంత్రిపై సెటైర్లు ( వీడియో )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరంతేజ్ కాంబినేషన్ తెర‌ర్కెక్కిన బ్రో సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ లో హిట్ అయిన వినోదయ సితం సినిమాకు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. వింటేజ్ ప‌వ‌న్ స్క్రీన్ పై కనిపించడంతో ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. బ్రో సినిమాలో పవన్ పాత సినిమాల పాటలతో వచ్చే కొన్ని సన్నివేశాలు పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.

పవన్ ఫ్యాన్స్ పాత సాంగ్స్ కు ఫ్యాన్స్‌ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పవన్ గత సినిమాలు వకీల్ సాబ్ – భీమ్లా నాయక్ లో పొలిటికల్ పరంగా కొన్ని డైలాగులు బాగా పేలాయి. అయితే బ్రో సినిమా రచయిత త్రివిక్రమ్ ఈ సినిమాలోని ఒకటి రెండు సీన్ల‌లో పొలిటికల్ టచ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రెండు సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు ఏపీ రాజకీయాలకి లింక్ చేసి కామెంట్లు చేస్తున్నారు.

ఒక పాటలో 30 ఇయర్స్ పృథ్వి శ్యాంబాబు అనే పాత్ర పోషిస్తారు. ఈ శ్యాంబాబు క్యారెక్టర్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ పాటలో పృథ్వి చేసిన డ్యాన్స్ గతంలో అంబటి రాంబాబు పబ్లిక్ గా చేసిన డ్యాన్స్ ఒకేలా ఉన్నాయి.

దీంతో శ్యాంబాబుగా పృథ్వి చేసిన డాన్స్ వీడియో అప్పుడు అంబటి చేసిన డ్యాన్స్ వీడియో కలిపి ఎడిట్ చేసి ఒకేలా ఉన్నాయంటున్నారు. ఆ శ్యాంబాబు అంబటి రాంబాబు నా బ్రో అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేయండి.