‘ బీఆర్ఎస్ కారు ‘ గ్రాఫ్ డౌన్‌.. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఎన్ని సీట్లు వ‌స్తాయంటే..!

టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా సత్తా చాటుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఎంట్రీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇటు ఆంధ్రాలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. అటు మహారాష్ట్రలోనూ ఆ పార్టీ దూసుకుపోతోంది. అయితే తాజాగా జరిగిన సర్వేలో బిఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతున్నట్టు తెలుస్తుంది.

ఇండియా టీవీ – సిఎన్ఎక్స్ సంస్థలు కలిపి చేసిన సర్వేలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అవుతున్నట్టు తేలింది. ప్రస్తుతం లోక్సభలో బి.ఆర్.ఎస్ కు తొమ్మిది సీట్లు ఉన్నాయి. అయితే ఈసారి ఒకటి నుంచి రెండు స్థానాలు తగ్గుతాయని.. ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ కేవలం 8 స్థానాలకే పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది.

బిజెపికి ప్రస్తుతం నాలుగు లోక్సభ స్థానాలు ఉండగా మరో రెండు అదనంగా వస్తాయని తేలింది. కాంగ్రెస్‌కు మూడు స్థానాలు ఉంటే అందులో ఒకటి చేజారి పోతుందని వెళ్లడైంది. ఇక హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని మజ్లిస్ ప‌దిలం చేసుకుంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఏది ఏమైనా తెలంగాణలో అధికార బి.ఆర్.ఎస్ పార్టీకి రోజురోజుకు గ్రాఫ్ తగ్గుతుందన్న అంచనాల నేపథ్యంలో తాజా సర్వేలోను ఆ పార్టీకి అంత సానుకూల ఫలితాలు అయితే రాలేదు.