ఆ సినిమా కోసం త‌న కిష్ట‌మైంది కూడా వ‌దిలేసిన బ‌న్నీ… ఏ సినిమా… ఏంటా ఇష్టం..!

సాధారణంగా ఎవరైనా తమకి ఇష్టమైనవి వదులుకోవాలంటే అంత‌ తొందరగా అసలు ఒప్పుకోరు. నిజానికి త్యాగం అనేది ఎంతో గొప్పది. వారికి నచ్చిన వస్తువులని లేదా వ్యక్తులని కానీ మరి ఏవైనా వదిలేయాలి అంటే చాలా కష్టం. కానీ కొంతమంది మాత్రం వారి సంతోషం కోసం తమకు నచ్చినవి త్యాగం చేయడానికి కూడా అసలు వెనకాడరు. వారి సంతోషం కోసం అన్ని ఇచ్చేయమన్న ఇచ్చేస్తూ ఉంటారు.

అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ సినిమా కోసం తనకు ఇష్టమైనది వదులుకున్నాడట ఇంతకీ అది ఏంటో ? ఇప్పుడు చూద్దాం. గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్‌లోనే స్టైలిష్ స్టార్‌గా ఎదిగి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు.

అయితే అల్లు అర్జున్‌కు చికెన్ అంటే చాలా ఇష్టమ‌ని గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అల్లు అర్జున్ ఆరు నెలల పాటు ఓ సినిమా కోసం తనకు నచ్చిన చికెన్ వదిలేసాడు. ఇక ఆ సినిమా మరేదో కాదు దువ్వాడ జగన్నాథం. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ పాత్రలో కనిపించిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో పూర్తిస్థాయి బ్రాహ్మణ పాత్రపై ఉన్న గౌరవం కోసం నిజంగానే అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు తనకి ఇష్టమైన నాన్ వెజ్‌కి దూరంగా ఉన్నాడట. బ్రాహ్మణులపై ఉన్న గౌరవంతో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో పలు వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక దీంతో మరోసారి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.