ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది… ఎన్టీఆర్ – ప్రియాంక చోప్రా కాంబినేష‌న్ ఫిక్స్‌..!

నంద‌మూరి అభిమానుల‌తో పాటు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, తెలుగు సినీ అభిమానుల ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ – కొర‌టాల శివ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా లో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అస‌లు ఎన్టీఆర్ – జాన్వీ జోడీని తెర‌మీద ఎప్పుడెప్పుడు చూస్తామా ? అని తెలుగు సినీ జ‌నాలు అంతా ఒక్క‌టే ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు.

Man of Masses NTR Jr Takes Over The Internet With More Than 25 Million  Mentions On Twitter In A Year's Time - Filmibeat

ఇక కొర‌టాల శివ త‌ర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ట‌. కొద్ది రోజుల క్రిత‌మే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌క్క‌న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె నటించబోతుందన్న టాక్ వ‌చ్చింది.

అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా బాలీవుడ్ ముదురు ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ రాసిన కథలో హీరోయిన్ పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ట‌. ఆ పాత్ర‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తేనే పాన్ ఇండియా లెవ‌ల్‌తో పాటు గ్లోబ‌ల్ వైడ్‌గా తిరుగులేని క్రేజ్ వ‌స్తుంద‌ని ప్రియాంక‌నే హీరోయిన్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Jr NTR Birthday Special: Priyanka Chopra To Deepika Padukone, Bollywood  Actresses We Wish To See Opposite RRR Star

ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఎన్టీఆర్ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకువెళ‌తాడు. ఈ లోగా ఎన్టీఆర్ కొర‌టాల శివ సినిమాను పూర్తి చేయ‌నున్నాడు. ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమా ఇండో – పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఉంటుంద‌ట‌.