జాన్వీ క‌పూర్ మ‌హా ముదురు.. ఏకంగా ఎన్టీఆర్ నే మోసం చేస్తుందా?

బాలీవుడ్ ముద్దుగుమ్మ, దివంగ‌త న‌టి శ్రీదేవి కుమార్ జాన్వీ కపూర్ త్వరలోనే టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ `దేవ‌ర‌`లో జాన్వీ హీరోయిన్ గా ఖరారు అయింది. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా ఇది.

NTR 30 is Devara: From Cast to Release Date, All You Need to Know About Jr  NTR, Janhvi Kapoor and Saif Ali Khan's Upcoming Telugu Film | 🎥 LatestLY

ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విల‌న్ గా అల‌రించ‌బోతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యవ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్ లో ఈ మూవీ మేజ‌ర్ షెడ్యూల్ ను చిత్రీక‌రిస్తున్నారు. ఇక‌పోతే ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ మత్స్యకార కుటుంబానికి చెందిన యువతిగా క‌నిపించ‌బోతోంది.

Devara: Jr NTR, Janhvi Kapoor, Saif Ali Khan's fees

ఇప్ప‌టికే మేక‌ర్స్ ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను రివీల్ చేశారు. అయితే తాజాగా జాన్వీ పాత్ర‌కు సంబంధించి కొన్ని షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. జాన్వీ రోల్ లో ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందట‌. ఆమె నిజానికి ఓ అండర్ కవర్ ఆఫీసర్ పాత్ర‌ను పోషిస్తుంద‌ట‌. కోస్టల్ ఏరియాలో క్రూరాతి క్రూరమైన వ్యక్తిగా ఉండే ఎన్టీఆర్ ను ట్రాప్ చేసేందుకు ఆమె మత్స్యకార యువతిగా వేషం మారుస్తుంద‌ట‌

Janhvi Kapoor opens up about chance to work with Jr NTR | 123telugu.com

మ‌హా ముదుద‌రు అయిన జాన్వీ.. అమాయ‌కంగా క‌నిపిస్తూ ప్రేమ పేరుతో ఎన్టీఆర్ ను మోసం చేస్తుంద‌ట‌. అత‌డికి ద‌గ్గ‌రై ట్రాప్ చేయాల‌ని అనుకుంటుంద‌ట‌. ఫస్టాఫ్ మొత్తం ఆమె మత్స్యకార యువతిగానే కనిపిస్తుందని.. ఇక‌ ప్రీ ఇంటర్వెల్ టైమ్ లో జాన్వీ అండర్ కవర్ ఆఫీసర్ అనేది రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఈ ట్విస్ట్ సినిమాకే హైలెట్ అవుతుంద‌ని టాక్ న‌డుస్తోంది. అన్న‌ట్లు దేవ‌ర మూవీకి జాన్వీ క‌పూర్ ఏకంగా రూ. 4 కోట్లు ఛార్జ్ చేస్తోంది. ఈ సినిమా క‌నుక మంచి విజ‌యం సాధిస్తే.. జాన్వీ సౌత్ ను దున్నేయ‌డం ఖాయ‌మ‌వుతుంది.