ఎన్టీఆర్ ‘ దేవ‌ర ‘ ఫ‌స్ట్ లుక్‌… రాజ‌మౌళి సెంటిమెంట్‌తో బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌రే…. ఆ సూప‌ర్ ట్విస్ట్ ఇదే..!

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెర‌కెక్కుతోన్న ఎన్టీఆర్ 30వ సినిమా టైటిల్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుక‌గా ఈ రోజు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో పాటు టైటిల్ వ‌దిలారు. ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ అయితే నిజంగా అరాచ‌కం అని చెప్పాలి. ఎన్టీఆర్ అరివీర భ‌యంక‌ర‌మైన గెట‌ప్‌లో.. మాంచి రౌద్ర ర‌సంతో ఉన్నాడు.

NTR30: రౌద్రంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్.. ఏం చేస్తిరి ఏం చేస్తిరి! - ntr30  first look poster trending in socal media - Samayam Telugu

బ్లాక్ ష‌ర్ట్‌, బ్లాక్ లుంగీ తో పాటు పెద్ద బ్లాక్ తువ్వాలు వేసుకుని చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉన్నాడు. అందులోనూ చేతిలో ప‌దునైన ఆయుధంతో స‌ముద్రం ఒడ్డు రాళ్ల‌మీద అల‌ల వైపు త‌దేకంగా చూస్తున్నాడు. స‌ముద్రంలో విల‌న్ల భ‌ర‌తం ప‌ట్టేందుకు ర‌గులుతోన్న‌ట్టుగా క‌సితో ఉన్నాడు. ఇక టైటిల్‌గా దేవ‌ర ఫిక్స్ చేశారు. త్రిబుల్ ఆర్ త‌ర్వాత వ‌స్తోన్న పాన్ ఇండియా సినిమా కావ‌డంతో కొర‌టాల కూడా అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల‌కు సింపుల్‌గా యాప్ట్ అయ్యేందుకు దేవ‌ర అనే కామ‌న్ టైటిలే ఫిక్స్ చేశాడు.

టైటిల్ విష‌యంలో రాజ‌మౌళి సెంటిమెంట్‌నే కొర‌టాల ఫాలో అయిన‌ట్టుగా ఉంది. ఏదేమైనా భీక‌ర‌మైన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌తో సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. మ‌రి కొర‌టాల సినిమాను ఎంత గ్రాండ్‌గా, పాన్ ఇండియా లెవ‌ల్లో ప్ర‌జెంట్ చేస్తాడ‌న్న‌దే చూడాలి. ఎన్టీఆర్ లుక్‌, క్యారెక్ట‌ర్ అయితే చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండ‌బోతున్నాయ‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.

I may have to retire after five years: Koratala Siva | Telugu Movie News -  Times of India

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తూ వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 ఏప్రిల్ 5 న విడుదల చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.