జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఆ పేరు ఎలా ? వ‌చ్చింది… ఆ టాప్ సీక్రెట్ ఇదే…!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో. వరుసహిట్లతో దూసుకుపోతూ మంచి జోష్లో ఉన్నాడు. టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ విజయ పరంపర ప్రారంభమైంది. తాజాగా గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఈ సినిమా రు. 1200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. టాలీవుడ్ లోనే మంచి పేరు ఉన్న నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్.

55 Unseen Photographs From The Gallery Of Young Tiger Jr NTR - Wirally

22 సంవత్సరాల కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తాత నటరత్న నట సౌర్వ‌భౌము ఎన్టీఆర్, బాబాయ్ నటరత్న నందమూరి బాలకృష్ణ సినిమా ప్రస్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. కేవలం 20 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి లాంటి సూపర్ డూపర్ హిట్టులతో తెలుగు గడ్డపై అప్పట్లో తిరుగులేని సంచలనం క్రియేట్ చేశాడు.

సింహాద్రి అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ సినిమాల పరంగాను అటు రాజకీయాల్లోనూ సంచలనంగా మారాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కు ఆ పేరు ఎలా ? వచ్చింది అన్నది ఆసక్తికరమే. తన తాత సీనియర్ ఎన్టీఆర్ ఈ జూనియర్ కు తారకరామారావు అని స్వయంగా పేరు పెట్టారట. ఒకరోజు హరికృష్ణ ఎన్టీఆర్ ను తీసుకుని తండ్రి దగ్గరకు వెళ్లారట. ఎన్టీఆర్ తారక్‌ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని పలకరించడంతోపాటు నందమూరి తారక రామారావు అని నామకరణం చేశారు.

N. T. Rama Rao Jr./Jr. NTR Wiki, Age, Wife, Family, Height, Biography & More - BigstarBio

జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య షాలినికి 1983 మే 24న‌ పుట్టాడు. సీనియర్ ఎన్టీఆర్ తన కుమారులకు పేరు చివర కృష్ణ అని పేరు పెట్టారు. హరికృష్ణ మాత్రం తన కొడుకులకు పేరు చివర రామ్ అని పెట్టారు. అందుకే కళ్యాణ్ రామ్ – జానకి రామ్ – తారక్ రామ్‌ అని పేర్లు పెట్టారు. హరికృష్ణ తారక రామ్ అని పేరు పెట్టినాఎన్టీఆర్ తారకరామారావు అని మార్చడంతో పాటు నువ్వు నాలాగే గొప్పవాడివి అవుతావు అంటూ ఆశీర్వదించారట. అలా తారకరామారావుగా తారక్ పేరు మారిపోయింది.