టాలీవుడ్‌లో నెంబ‌ర్ 1 స్టార్ బెల్లంకొండ‌…. ఎందులోనో తెలిస్తే దిమ్మ‌తిరిగి పోద్ది…!

ఎస్ ఇప్పుడు ఈ టైటిల్‌కు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ న్యాయం చేస్తున్న‌ట్టుగానే ఉంది. బెల్లంకొండ అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌తి సినిమాకు భారీ కాస్టింగ్‌, పెద్ద డైరెక్ట‌ర్లు.. భారీ బ‌డ్జెట్‌ల‌తో వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్ప‌ట‌కీ స‌రైన బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌డ‌లేదు. కొన్ని సినిమాల‌కు మంచి క‌లెక్ష‌న్లు వ‌చ్చినా అవి కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచాయి. రాక్ష‌సుడు సినిమా మాత్రం బాగానే ఆడింది.

Chatrapathi (2023 film) - Wikipedia

అయితే బెల్లంకొండ మాస్ సినిమాకు హిందీ డ‌బ్బింగ్‌లో మిలియ‌న్ల కొద్ది వ్యూస్ వ‌చ్చాయి. ఇంకేముందు ఉట్టికి నిచ్చెన వేశాడు.. ద‌బాలున కింద‌ప‌డ్డాడు. త‌న హిందీ డ‌బ్బింగ్ సినిమాల‌కు యూట్యూబ్‌లో వ‌చ్చిన వ్యూస్ చూసుకుని మురిసిపోయాడు. ఇంకేముంది డైరెక్ట్ హిందీ సినిమా చేస్తే తిరుగు ఉండ‌ద‌నుకున్నాడు. అయితే ఇక్క‌డే ప‌ప్పులో కాలేశాడు.

Bellamkonda Sai Sreenivas, Nabha Natesh, Anu Emmanuel starrer Alludu Adhurs  to hit screens this Sankranti | Telugu Movie News - Times of India

ఎప్పుడో తెలుగులో వ‌చ్చిన అవుట్ డేటెడ్ కంటెంట్ అయిన ఛ‌త్ర‌ప‌తిని అక్క‌డ రీమేక్ చేశారు. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తీశారు. మొత్తం కోటి రూపాయ‌ల క‌లెక్ష‌న్లు కూడా రాలేదు. ఇంకా చెప్పాలంటే తెలుగులో వ‌చ్చిన ఏజెంట్‌, క‌స్ట‌డీని మించిన డిజాస్ట‌ర్ అయ్యింది. అంటే దీనిని బ‌ట్టి టాలీవుడ్ హీరోలందు యూట్యూబ్ హీరోలు వేరయా అనుకోవాల్సిందే.

Chatrapathi (2023) - IMDb

ప్ర‌తి సినిమాను హిందీలో డ‌బ్ చేసి వ‌చ్చే మిలియ‌న్ల కొద్ది వ్యూస్ చూసుకుని మురిసిపోసి డైరెక్టుగా హిందీలో ఇర‌గ‌దీయ‌వ‌చ్చ‌ని సినిమాలు తీస్తే ఎలా ఉంటుందో చెప్పేందుకు బెల్ల‌కొండ ఛత్ర‌ప‌తి పెద్ద ఉదాహ‌ర‌ణ‌. దీనిని బ‌ట్టి బెల్లంకొండ లాంటి వాళ్ల‌ను బాలీవుడ్‌లో హీరోలు అన‌డం కంటే యూట్యూబ్ స్టార్స్ అంటే బాగుంటుందేమో అన్న సెటైర్లు కూడా ప‌డుతున్నాయి. క‌థ‌ను వ‌దిలేసి సాము చేస్తే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇలాంటి సంఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌నం. క‌థ‌లో ద‌మ్ముంటే హీరో ఎవ‌రు అన్న‌ది చూడ‌కుండా బాలీవుడ్ లో అయినా సినిమాలు హిట్ అవుతాయ‌నేందుకు కార్తీకేయ 2 లాంటి సినిమాలే ఉదాహ‌ర‌ణ క‌దా..!