ఎన్టీఆర్ – అక్కినేనికి ఆ ఇద్ద‌రు హీరోయిన్లు అంటే అంత లైకింగా…!

ఒక‌ప్పుడు.. స్టార్ డ‌మ్ ఉన్న హీరోలు క‌లిసి న‌టించేందుకు పెద్ద‌గా వెనుకాడేవారు కాదు. కానీ, ఇప్పుడు అలా కాదు.. అభిమాన గ‌ణం ఏమ‌నుకుంటుందో.. వారి గ్రాఫ్ ఏమ‌వుతుందో.. అనే అనేక చ‌ర్చ‌లు.. ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కం.. క‌థా బ‌లం ఇలా అన్ని కోణాల్లోనూ చూసుకుంటున్నారు. అయితే.. గ‌తంలో ఎన్టీఆర్‌-అక్కినేనిల కాంబినేష‌న్ అంటే.. ఓ రేంజ్‌లో ఉండేది. క‌థ‌తోను, డైరెక్టర్‌తోనూ ఉన్న సంబంధం చూసుకుని.. ఇరువురూ.. ఒప్పుకొనేవారు.

 

ఇలా.. అన్న‌గారు-అక్కినేని భూ కైలాస్ నుంచి అనేక సినిమాల్లో క‌లిసి న‌టించారు. దాదాపు అన్నీ సూప‌ర్ హిట్లు కొట్టాయి. అయితే.. ఇలా అన్న‌గారు-అక్కినేని మాదిరిగానే.. హీరోయిన్లు కూడా క‌లిసి న‌టించిన సినిమాలు ఉన్నాయి. ఇలా న‌టించిన వారిలో శ్రీదేవి-జ‌య‌సుధ‌, శ్రీదేవి-జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ‌-జ‌య‌ప్ర‌ద లు ఉన్నారు. వీరు కూడా.. తెర‌వెనుక ఏంటి? అనేది ఎప్పుడూ ఆలోచించ‌లేదు. అయితే, రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో గొడ‌వ ప‌డిన శ్రీదేవి త‌ర్వాత‌.. త‌ర్వాత‌.. క‌లిసి న‌టించ‌డం మానేశారు.

KD No 1 Songs - Malli Malli Andhi - NTR Jayasudha - video Dailymotion

ఇక‌, జ‌య‌సుధ‌-జ‌య‌ప్ర‌దలు మాత్రం రెమ్యున‌రేష‌న్‌తోనూ సంబంధం లేకుండా.. క‌థ‌, డైరెక్ట‌ర్ అనే రెం డు అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగారు. ఫ‌లితంగా.. వీరు అనేక సినిమాల్లో క‌లిసి న‌టించా రు. ఎన్టీఆర్‌-అక్కినేనిల నుంచి కృష్ణ‌, శోభ‌న్‌బాబుల దాకా కూడా.. ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. అనేక హిట్ మూవీల‌ను త‌మ ఖాతాల్లో వేసుకున్నారు. అయితే.. జ‌య‌ప్ర‌ద‌కు బాలీవుడ్ అవ‌కాశాలు రావ‌డంతో .. వీరికి జంట అవ‌కాశాలు కూడా త‌గ్గిపోయాయి.

Nee Choopulona Video Song || Pilla Zamindar Movie || ANR,Jayasudha - YouTube

మ‌రోవైపు.. జ‌య‌సుధ మాత్రం ఎవ‌రితోనైనా క‌లిసి న‌టించేందుకు రెడీ అంటూ.. త‌ర్వాత త‌రంలో వ‌చ్చిన హీరోయిన్‌ల‌తోనూ క‌లిసి న‌టించింది. ఇక‌, త‌ర్వాత‌.. త‌ర్వాత స్కిన్ షో ప్రాధాన్యం పెరిగిన ద‌రిమిలా.. జ‌య‌సుధ వేగం త‌గ్గిపోయింది. ఉదాహ‌ర‌ణ‌కు ప్రేమాభిషేకం సినిమా చూస్తే.. శ్రీదేవితో జ‌య‌సుధ క‌లిసి న‌టించారు. అందునా వేశ్య పాత్ర వేశారు. ఇలా.. ఎక్క‌డా త‌డ‌బాటు అనేది లేదు. ఇలా.. ఇప్పుడు మ‌నం ఊహించే ప‌రిస్థితి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Chandhamaama Video Song || Buchi Babu Movie || ANR,Jayapradha - YouTube

Tags: ANR, film news, filmy updates, intresting news, latest news, latest viral news, ntr, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news