మొదటి భర్తతో విడాకుల తర్వాత హీరోయిన్ ప్రేమ‌కు మ‌రో బిగ్ బ్రేక‌ప్‌.. ఎవ్వ‌రికి తెలియ‌ని సీక్రెట్స్ …!

సవ్యసాచి అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అందాల తార ప్రేమ. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ప్రేమ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. మొదట ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కలలు కన్నప్పటికీ అనుకోకుండా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. మొద‌టి సినిమాతోనే కన్నడ నాట ప్రేక్షకుల మనసు దోచుకోవడంతో వరుస ఆఫర్లను అందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ ప్రేమ సినిమాలు చేసింది.

Upendra Maththe Baa, final stage shoot - Kannada News - IndiaGlitz.com

తెలుగులో ఓంకారం, పోలీస్ పవర్, దేవి, మా ఆవిడ‌ కలెక్టర్, ధర్మచక్రం లాంటి సినిమాలతో అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా దేవి సినిమాతో ప్రేమ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఢీ సినిమాలో హీరోయిన్ కు వదిన పాత్రలోను నటించింది. ఆ సమయంలోనే జీవన్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది.

కానీ పెళ్లైన ప‌దేళ్ల‌కు అతనితో విడాకులు తీసుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ మాట్లాడుతూ తన పర్సనల్ సంబంధించిన విషయాలను బయట పెట్టింది. తనకు చాలా సింపుల్ గా ఉండటం ఇష్టం అని చెప్పింది. ఆటిట్యూడ్ తలలో ఉంటే చాలా కష్టమని వ్యాఖ్యానించింది. ఎలాంటి ఆస్తులు తనకు లేవని డబ్బులే ముఖ్యం కాదని చెప్పింది. అవసరమైన డబ్బు ఉంటే చాలని.. నేను చాలా బోల్డ్ గా మాట్లాడతానని తెలిపింది. ఉపేంద్రతో ప్రేమాయ‌ణం గురించి యాంకర్ ప్రశ్నించగా… అతనితో ప్రేమ గురించి రాసిన వారిని అడగాలని సమాధానం ఇచ్చింది.

Actor Prema files for divorce | Deccan Herald

అది ఒక గాసిప్ , అప్పుడు నా ఫోకస్ కేవలం సినిమాలపైనే అని స్పష్టం చేసింది. ఒకసారి సక్సెస్ వచ్చినప్పుడు ఇలాంటి వార్తలు వస్తాయని ప్రతి విషయానికి నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయని చెప్పింది. ఎలా వచ్చినా వాటిని ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. తాను డిగ్రీ చదివే సమయంలో చదువు మానేసి ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పింది. అంతేకాకుండా తనకు ఇండస్ట్రీలో సౌందర్యతో ఎక్కువ అనుబంధం ఉండేదని చెప్పింది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, prema, social media, social media post, star acttress\, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news