అక్క‌డ టీడీపీకి 20 ఏళ్ల త‌ర్వాత ల‌క్కీ ఛాన్స్‌…!

ఉమ్మడి కర్నూలు జిల్లాపై వైసీపీకి పట్టున్న విషయం తెలిసిందే..అందులో కొన్ని స్థానాలు వైసీపీకి కంచుకోటలుగా మారిపోయాయి..అలా కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో శ్రీశైలం కూడా ఒకటి. ఇక్కడ గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే టి‌డి‌పి ఇంతవరకు ఇక్కడ గెలవలేదు. 2008 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఈ స్థానం ఆత్మకూరుగా ఉండేది. అప్పుడు టి‌డి‌పి మూడు సార్లు గెలిచింది. 1983, 1985, 1999 ఎన్నికల్లో గెలిచింది.

Silpa Chakrapani Reddy: మళ్లీ టీడీపీలోకి శిల్పా చక్రపాణిరెడ్డి..? క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. - NTV Telugu

బుడ్డా ఫ్యామిలీ అక్కడ టి‌డి‌పి తరుపున గెలుస్తూ వచ్చింది. ఇక 2008లో విభజన జరిగాక శ్రీశైలంగా ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి గెలిచారు. అప్పుడు టి‌డి‌పి నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014లో ఏరాసు టి‌డి‌పిలోకి రావడంతో, బుడ్డా వైసీపీలోకి వెళ్లారు. అయితే ఏరాసు పాణ్యంలో పోటీ చేయగా, శ్రీశైలం నుంచి టి‌డి‌పి తరుపున శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేశారు. ఇక వైసీపీ నుంచి బుడ్డా 4 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

కానీ ఆయన ముందు నుంచి టి‌డి‌పి కావడంతో ..రాష్ట్రంలో టి‌డి‌పి అధికారంలోకి రావడంతో బుడ్డా మళ్ళీ టి‌డి‌పిలోకి వచ్చారు. బుడ్డా టి‌డి‌పి వైపుకు రావడంతో..శిల్పా వైసీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో బుడ్డా టి‌డి‌పి నుంచి, శిల్పా వైసీపీ నుంచి పోటీ చేశారు. జగన్ గాలిలో శిల్పా 38 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

షాక్: అనుచరులతో ఎమ్మెల్యే బుడ్డా మంతనాలు, శిల్పాకు దెబ్బేనా? | Mla Budda Rajasekhar reddy tries to attract Shilpa Chakrapani reddy followers. - Telugu Oneindia

అంత మెజారిటీతో గెలిచినా సరే ప్రజల అంచనాలకు తగ్గట్టుగా శిల్పా పనిచేయలేకపోతున్నారు. ఇటు బుడ్డా మొదట్లో యాక్టివ్ గా లేకపోయినా ఇప్పుడు దూకుడుగానే పనిచేస్తున్నారు. దీంతో శ్రీశైలంలో సీన్ రివర్స్ అవుతుంది. ఇంకొంచెం కష్టపడితే శ్రీశైలంలో 20 ఏళ్ల తర్వాత టి‌డి‌పి జెండా ఎగిరే ఛాన్స్ ఉంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp, YS Jagan