అడివి శేష్ పోస్టుకు అర్థం తెలియక.. ఆ స్టార్ కమెడియన్ ఏం చేశాడో చూడండి…!

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి పరిచయం అవసరం లేదు. విలక్షణమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్గా హిట్ 2, మేజర్ సినిమాలతో మంచి మార్కులు కొట్టేశాడు. త్వరలోనే తన గూఢ‌చారి 2 సినిమాతో ప్రేక్షకులు ముందుగా రాబోతున్నాడు అడివి శేష్. ఈ యంగ్ హీరో సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటాడు.

Young Star's Major transformation as Super Star | cinejosh.com

ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ యంగ్ హీరో పై ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్‌గా మారింది.
అడివి శేష్ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ఆ పోస్ట్ కాస్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. శేష్ తన పోస్టులో.. ‘ వచ్చిన దారినే చూసుకోకపోతే.. ముందున్న దారిని ఎలా ?సర్దుకుంటాం..? అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చాడు ‘. అయితే అడివి శేష్ ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడో దీనికి అర్థం ఏమిటో తెలియక నెటిజన్లు బుర్ర పీక్కుంటున్నారు

పలువురు సినీ సెలబ్రిటీలు ఈ పోస్ట్‌ను సిల్లీగా తీసుకుంటున్నారు. ఇక ఆ పోస్ట్ కి సిల్లీ కామెంట్లు కూడా ఇస్తున్నారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ అయితే.. ‘అడవి శేష్‌ ఏదో రహస్యంగా చెబుతున్నాడు.. కొంపతీసి మన గురించా ఏంటి..? అంటే, మరో నటుడు రాహుల్ రవీంద్ర కు ఆ పోస్టును ట్యాగ్ చేయగా’.. వెన్నెల కిషోర్ పోస్ట్‌కి రాహుల్ ఈ విధంగా రిప్లై ఇచ్చాడు.

Vennela Kishore Age, Affairs, Wife, Family, Biography & More » StarsUnfolded

‘అవన్నీ ట్రాఫిక్​ కోట్స్.. ప్రశాంతంగా ఉండి.. కిందకి స్క్రోల్​ చేయండి’ అని రాసుకొచ్చారు.
ఇక నెటిజన్లు అయితే.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఏంటన్నా.. ఏంటి మ్యాటర్?’, ‘మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేమ్’, ‘ఏమైంది అన్నయ్యా?’, ‘కొంచెం అర్థమయ్యేట్టు చెప్పరాదే’, ‘టైటిల్ చాలా పెద్దగా ఉంది అన్నా’.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా నెటిజన్ల కామెంట్స్‌తో.. ప్రస్తుతం అడివి శేష్ చేసిన ఈ ట్వీట్ వైరల్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.