హాట్ అందాలతో మొగుడిని రెచ్చకొడుతున్న మెగా డాటర్..చైతన్య లొంగుతాడా..?

మెగాబ్ర‌ద‌ర్ నాగబాబు కుమార్తె నిహారిక భర్తతో విడిపోతున్నారనేది టాలీవుడ్ లో గత పది రోజులుగా చర్చ‌కి వస్తోంది. గత మూడు నాలుగు వారాలుగా వీరిద్ద‌రి విడాకుల‌పై వరుసగా కథనాలు వెలువ‌డుతున్నాయి. ఓవైపు తన వ్యక్తిగత, వైవాహిక జీవితం విషయంలో ఇంత సీరియస్ గా చర్చలు నడుస్తుంటే.. మరోవైపు నిహారిక హాట్ ఫోటోషూట్ చేయడం ఇండస్ట్రీ వర్గాలలో ఇప్పుడు సంచల‌నంగా మారింది. అసలు నిహారిక మనసులో ఏముంది అన్నది ఎవరికీ ? అంతుపట్టడం లేదు.

ఇటు నిహారిక తన భర్త చైతు కలిసి ఎక్కడా కనపడటం లేదు. ఒకరి సోషల్ మీడియా ఖాతాలను మరొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇద్దరూ వేరువేరు దారుల్లోనే ప్రయాణిస్తున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇక నిహారిక హైదరాబాదులో ఓ కాస్ట్‌లీ ఏరియాలో ఆఫీస్ కూడా ఓపెన్ చేసింది. తాజాగా ఈ ఫోటోషూట్ చూస్తున్న ఇండస్ట్రీ జనాలు అందరూ విడాకులపై నిహారిక మరొక హింట్‌ ఇచ్చిందని అంటున్నారు.

Niharika Konidela and Chaitanya Jonnalagadda get clicked as newly-weds in  Udaipur | Telugu Movie News - Times of India

చాలాకాలంగా విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీ లేడీస్ తమ భర్తలను రెచ్చగొట్టేలా హాట్ ఫోటో షూట్ లు చేస్తున్నారు. సమంత కూడా నాగచైతన్యతో విడిపోవడానికి ముందు.. విడిపోయాక కూడా ఈ తరహా ఫోటోషూట్లు చేసి చైతును ఉడికించినట్టుగా కనబడింది. విడాకులు తీసుకున్న వెంటనే పుష్ప‌ సినిమాలో ఊ అంటావా మావా అంటూ సమంత చేసిన ఐటమ్ సాంగ్ చూస్తే ఎంత మాజీ భర్త అయినా చైతు అవమానంగా ఫీల్ అయ్యాడు.

ఇప్పుడు నిహారిక విడాకులు ఇవ్వకుండానే ఇంత హాట్ గా ఫోటోషూట్లు చేస్తుండడంతో భర్తను పూర్తిగా పక్కన పెట్టేసిందని.. అతడితో రాజీ పడి తిరిగి కలిసి ఉండేందుకు ఇష్టపడటం లేదని క్లారిటీ వచ్చిందని అంటున్నారు. మ‌రి చైతు నిహారిక చేస్తోన్న ఈ ఫొటో షూట్ల‌తో అయినా రిప్లే ఇస్తాడా ? అన్న‌ది చూడాలి. ఇక వీరిద్దరూ విడిపోతున్నారు అన్న వార్తలపై అటు చైతు కుటుంబ సభ్యులు.. ఇటు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు స్పందించడం లేదు. దీంతో నిహారిక విడాకుల విషయంలో క్లారిటీతోనే ఉన్నట్టు తెలుస్తోంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Mega Family, Mega Heroine, niharika konidala, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news