‘ స్పై ‘ మూవీ రివ్యూ… నిఖిల్ ఈ సారి ఇంత షాక్ ఇచ్చావేంటి బాసు…!

యంగ్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా పాన్ ఇండియా ప్రాజెక్టులే చేస్తున్నాడు. నిఖిల్ నుంచి తాజాగా వ‌స్తోన్న సినిమా స్పై మూవీ. ఎడిట‌ర్ బీ హెచ్‌. గ్యారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. నిఖిల్‌కు జోడీగా త‌మిళ హీరోయిన్ ఐశ్వ‌ర్య మీన‌న్ న‌టించింది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షో లు కూడా కంప్లీట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా టాక్ విషయానికొస్తే ప్రారంభం చాలా స్లోగానే మొదలవుతుందట. తర్వాత ఆసక్తికరమైన మ‌లుపులు తిరుగుతూ ఆడియన్స్ కి మంచి త్రిల్లింగ్ అనుభూతి ఇస్తుందట. అలా ఫస్ట్ అఫ్ మొత్తం సాగిపోతుందని చెబుతున్నారు. అయితే సెకండ్ హాఫ్ చాలా బలంగా ఉండే విధంగా ఇంటర్వెల్ డిజైన్ చేశాడు దర్శకుడు. సెకండాఫ్ స్టార్టింగ్ లో సినిమా చాలా గ్రిప్పింగ్ గా మొదలవుతుందని.. ఆ తర్వాత నెమ్మదిగా స్లో అవుతూ వెళుతుందని తెలుస్తోంది.

హీరో నిఖిల్ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించారని చెబుతున్నారు. పైగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ గురించి ఆసక్తికర అంశాలు ఉంటాయన్న ప్రచారంతో ఈ సినిమాపై బాగా హైప్‌ వచ్చేసింది. సినిమా ఫస్ట్ అఫ్ అంత రెగ్యులర్ పై స్టైల్ లోనే దర్శకుడు ఈ సినిమాను డీల్ చేశాడు.. ఎక్కడా మంచి హైప్ తెచ్చే సీన్లు లేవని అంటున్నారు. సెకండ్ హాఫ్ లోను సుభాష్ చంద్రబోస్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ సీన్లు బాగానే వచ్చాయని.. కొన్ని ఎంగేజింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయని అంటున్నారు.

ఈ రెండు విషయాలు మినహా సినిమా అంతా ఆడియన్స్ కి బోర్ కొట్టించే విధంగా తెరకెక్కించారని సినిమా గ్రాఫ్ చాలా ప్లాట్ గా ఉందని చెబుతున్నారు. కార్తికేయ సినిమా లాగా స్పై సినిమాలో సస్పెన్స్ లేదని సినిమా నిరాశపరిచిందని తెలుస్తోంది. అయితే మంచి ప్రొడక్షన్ వాల్యూస్.. డీసెంట్గా అనిపించే బిజిఎం పైగా నిఖిల్ అందించిన పెర్ఫార్మన్స్ ఈ సినిమాకు మేజర్ హైలెట్స్ అని చెబుతున్నారు.

సినిమాకు హైప్ ఇచ్చే అంశాలు ఎక్కువుగా కనిపించకపోవడంతో స్పై మూవీ రెగ్యులర్ గూఢచారి కథగా.. బిలో యావరేజ్ సినిమాగా మిగిలిపోయిందని అంటున్నారు. వాస్తవానికి సుభాష్ చంద్రబోస్ డెత్‌ మిస్టరీ అంశాన్ని ఉపయోగించుకుని బలమైన సినిమాగా తీర్చిదిద్ది ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేదని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా టాక్ పూర్తిగా తెలియాలంటే మొత్తం రివ్యూ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.