పవన్ కళ్యాణ్ ‘ OG ‘ మూవీ స్టోరీ లైన్ లీక్.. ఫ్యాన్స్‌ను అస్స‌లు ఆప‌లేంగా…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. సినీ రంగంలో కోట్లాదిమంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన పవన్ ప్రస్తుతం రాజకీయ రంగంలోను అడుగుపెట్టాడు. అయిన‌ సినిమాల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. హిట్లు, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చేతిలో ప్ర‌స్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి.

అయితే వీటిల్లో ముందుగా త‌న మేన‌ళ్లుడు సాయి ధరమ్‌తేజ్ తో క‌లిసి న‌టిస్తోన్న మల్టీ స్టారర్ సినిమా బ్రోతో పాటు సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓజీ అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక అరుల్‌మోహన్ హీరోయిన్. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీ రోల్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా స్టోరీలైన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

యాక్షన్ మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమా 1950 కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో తిరకెక్క‌బోతుంద‌ని.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 60 ఏళ్ల నాటి గ్యాంగ్‌స్ట‌ర్‌గా కనపడనున్నాడట‌. అలాగే మార్షల్ ఆర్ట్స్ లో ఆసక్తికర ఫైట్స్ సీన్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయ‌ని టాక్. ఈ సినిమా తాజా షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది.

ఇక ఓజీ స్టోరీ కూడా ముంబై నేపథ్యంలోనే జరుగుతుందట‌. ఓజీ సినిమా ఈ యేడాది చివ‌రిలో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నారట. దీనికి అనుగుణంగా ఇప్పటికే షెడ్యూల్ కూడా సెట్ చేసుకుని అదే విధంగా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారట. లీకైన ఈ స్టోరీ లైన్ లో ఎంత ? నిజం ఉందో తెలియ‌దు కాని ఒకవేళ ఈ స్టోరీ లైన్ నిజమైతే పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా విజృంభిస్తాడ‌నే ఫ్యాన్స్ అంటున్నారు.