నాగ‌శౌర్య ‘ రంగ‌బ‌లి ‘ రివ్యూ… ప్రేక్ష‌కులు బ‌లి..!

హీరో నాగ‌శౌర్య పేరు చెప్ప‌గానే మ‌న‌కు మాంచి క్లాసిక్ సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. చాలా కాలంగా స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న నాగ‌శౌర్యకు ఛ‌లో త‌ర్వాత ఆ రేంజ్ హిట్ ద‌క్క‌లేదు. తాజాగా రంగ‌బ‌లి సినిమాతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌ల‌కి వెళితే శౌర్య ( నాగౌశ‌ర్య‌) రాజ‌వ‌రం అనే ఊళ్లో బేవార్స్‌గా తిరుగుతూ ఉంటాడు. ఎక్కువుగా షో చేస్తూ ఉండ‌డంతో ఇత‌డిని అంద‌రూ షో అని పిలుస్తూ ఉంటారు. ఊరంటే ఇత‌డికి పిచ్చి చ‌చ్చినా బ‌తికినా ఊళ్లోనే ఉండాల‌నుకునే మ‌న‌స్త‌త్వం అత‌డిది. ఓ రోజు వైజాగ్ వెళ‌తాడు. అక్క‌డ స‌హ‌జ ( యుక్తి త‌రేజా)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇంత‌లోనే పెళ్లి గురించి మాట్లాడేందుకు స‌హజ తండ్రిని క‌లుస్తాడు.

ఈ క్ర‌మంలోనే త‌న ఊరు రాజ‌వ‌రం అని చెప్ప‌గానే అక్క‌డ రంగ‌బ‌లి అనే సెంట‌ర్ ప్ర‌స్తావ‌న వ‌స్తుంది. వెంట‌నే తాను పెళ్లి చేయ‌న‌ని స‌హ‌జ తండ్రి చెపుతాడు. ఇంత‌కు ఆ సెంట‌ర్‌కు శౌర్య పెళ్లికి ఉన్న క‌నెక్ష‌న్ ఏంట‌న్న‌దే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఎలా ఉందంటే బ‌య‌ట ఊళ్లో బానిస‌లా బ‌త‌క‌డం కంటే సొంత ఊళ్లో సింహంలా బ‌త‌కాల‌న్న లక్ష్యంతో హీరో ఉంటాడు.

తండ్రి త‌న మెడిక‌ల్ షాపును త‌న కొడుక్కి అప్ప‌గించాల‌ని చూస్తూ ఉంటాడు. ఫ‌స్టాఫ్ కామెడీగా ఇబ్బంది లేకుండా న‌డుస్తుంది. అయితే పెళ్లి కోసం హీరోయిన్ తండ్రి ద‌గ్గ‌ర‌కు వెళ్లిన హీరోకు రంగ‌బ‌లి సెంట‌ర్‌తో ప్రాబ్ల‌మ్ వ‌స్తుంది. ఆ సెంట‌ర్‌తో హీరోయిన్ తండ్రికి ఉన్న స‌మ‌స్య ఏంట‌న్న‌దే స్టోరీ. స్టోరీ సెట్ చేయ‌డానికి ఫ‌స్టాఫ్‌ను ఉప‌యోగించుకున్న ద‌ర్శ‌కుడు అస‌లు క‌థ‌ను సెకండాఫ్‌లో న‌డిపిస్తాడు.

క‌రెక్టుగా చెప్పాలంటే కొత్త‌ద‌నం ఉండ‌దు.. క్లైమాక్స్ అయితే మ‌రీ సిల్లిగా ఉంటుంది. సెకండాఫ్‌లో మ‌నం ఎన్నో సినిమాల్లో చూసేసిన సీన్లే క‌నిపిస్తూ ఉంటాయి. హీరో జ‌స్ట్ 5 నిమిషాల స్పీచ్ ఇవ్వ‌గానే మారిపోతారు. నాగ‌శౌర్య ఈ సినిమాలో యాక్ష‌న్ హీరో కావాల‌న్న కోరిక‌తో ఉన్న‌ట్టు చేశాడు. హీరోయిన్‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే రంగ‌బ‌లి కాస్త ఫ‌న్‌. కాస్త ఎమోష‌న్ ఉండే రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ స్టోరీ. అంత‌కు మించిన ఆశ‌ల‌తో వెళ్లిన ప్రేక్ష‌కులు బ‌లి కావాల్సిందే.

రంగ‌బ‌లి రేటింగ్ : 2.5 / 5