ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – అనుష్క కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా ఇదే… స్వీటీ బ్యాడ్‌ల‌క్‌..!

చిత్ర పరిశ్రమలో కొన్ని కొన్ని కాంబోలు ఎంతో విచిత్రంగా ఉంటాయి. ఆ జంట బాగోలేకపోయినా సరే తెరపై వాళ్ళ కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అవుతూ ఉంటుంది. ఇదే సమయంలో ఈడుజోడు బాగున్న తెరపై ఆ జంట కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ అవదు. ప్రేక్ష‌కులు మాత్రం ఆ జంటలను ఎంతో బాగా ఆదరిస్తూ ఉంటారు. ఇదే సమయంలో కొన్ని కాంబోలను ఆ స్టార్ హీరోల అభిమానులు తెరపై చూడాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు.

అభిమానులు కోరుకున్నట్టు ఆ కాంబోలను తెరపై చూడాలనుకున్నటైం కలిసి రాకో, వారికి ఇష్టం లేకో కారణం ఏదైనా కావచ్చు కొన్ని కొన్ని సార్లు అలాంటి కాంబోలు మిస్ అవుతూ ఉంటాయి. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ పవన్ కళ్యాణ్- అనుష్క. మన తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 30 సినిమాల్లో నటించారు. అలాగే స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ఎన్నో సినిమాల్లో చేసింది. కానీ ప‌వ‌న్‌తో కలిసి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు.

ఇద్ద‌రు జంట కూడా చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటుంది. అలాంటి ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని అభిమానుల కోరిక. ఆ కోరిక ఎప్పటికీ తీరని కోరికగానే ఉంటుంద‌న్న సంగతి అందరికీ తెలుసు. గతంలో ఒకసారి మాత్రం ఈ ఛాన్స్ వచ్చింది కానీ అది వచ్చినట్లే వచ్చి మాయమైపోయింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో చెల్లి సెంటిమెంట్ తో వచ్చిన సినిమా అన్నవరం. ఈ సినిమా విడుదలై ఈ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆశిన్ నటించింది.

ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క శెట్టిని అనుకున్నారట. కానీ అదే సమయంలో ఈ సినిమా కన్నా ముందు అనుష్క పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో.. ఇలాంటి ఫ్యామిలీ సినిమాలో ఈమెను హీరోయిన్‌గా వద్దు అంటూ చిత్ర యూనిట్ రిజెక్ట్ చేసిందట. అలా పవన్ కళ్యాణ్- అనుష్క కాంబోలో మిస్సయిన ఆ సినిమా తర్వాత మరో సినిమా సెట్ అవ్వలేదు.. భవిష్యత్తులో కూడా వీరి కాంబోలో సినిమా వస్తుందని నమ్మకాలు మాత్రం లేవు.