ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘ సుస్వాగ‌తం ‘ ఆ రోజుల్లోనే క‌ళ్లు చెదిరే వ‌సూళ్లు రాబ‌ట్టిందా.. మైండ్ బ్లాక్ లెక్క‌లివే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో మొదటి బ్లాక్ బాస్టర్ హిట్ సుస్వాగతం. ఈ సినిమా అప్పట్లో థియేటర్స్ ని ఒక ఊపు ఊపింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ముందు గోకులంలో సీత, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాల్లో నటించినా ఇవి ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన మూడో సినిమా సుస్వాగతం బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచి అప్పట్లోనే దాదాపు రు. 5 కోట్ల వసూళ్ళు రాబట్టిందట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో నటించిన రఘువరన్ తో చేసిన ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా పండింది. ఈ సినిమాను చూసిన వారంతా తమ తండ్రితో కలిసి ఎంజాయ్ చేసిన క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నారంటే అతిశయోక్తి కాదు.

ఎమోషనల్ సీన్స్‌తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు కన్నీళ్లు రప్పించేశాడు. ప్రేయసి కోసం మొత్తం పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయిన యువకుడిగా పవన్ కళ్యాణ్ న‌ట‌న మెస్మ‌రైజ్ చేయ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల‌ను క‌దిలించింది. క్లైమాక్స్ సన్నివేశంలో తండ్రి చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ బాధపడిన సన్నివేశాలు ఎటువంటివారినైనా ఏడిపించేస్తాయి.

అంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ నటించినా సుస్వాగతం సినిమా త్వరలోనే 4కే క్వాలిటీతో మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారట‌. అదే నిజమైతే పవన్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తుందో? లేదో? చూడాలి. ఇప్పటికే రీ రిలీజ్ అయిన తొలిప్రేమ, జల్సా, ఖుషి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రకంపనులు సృష్టించాయి.