ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు ఛాన్సుల కోసం త‌ల్లే క‌మిట్‌మెంట్ ఇస్తోందా…!

మన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలంటే కంటికి కనిపించని, చెవులకి వినిపించని ఎన్నో లెక్కలుంటాయి. ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో కొనసాగే ఎవరికైనా టాలెంట్ తో పాటుగా బడా బాబుల అండదండలు మెండుగా ఉండాల్సిందే. కెరీర్ ప్రారంభంలో అసలు నువ్వు యాక్టింగ్ కి పనికిరావని అవమానాలు చూసిన వారు ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలినవాళ్ళే. ఇక్కడ అందరికీ తెలిసిన సీక్రెట్ కమిట్‌మెంట్. దీనికి వాస్తవంగా ఏ డిక్షనరీలోనైనా అద్భుతమైన అర్థం ఉంటుంది.

ఒక్క సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇదే కమిట్‌మెంట్ పదానికి నీచమైన అర్థం ఉంది. అదే దర్శక నిర్మాతలతో మాత్రమే కాకుండా అవకాశం ఇస్తానన్న ప్రతీ వాడి పక్కన చేరడం. ఒళ్ళు అప్పగించడం. ఇది అందరికీ నచ్చి చేస్తున్నారనే కొలమానాలు లేవు. దీనినే కాంప్రమైజ్ అంటున్నారు. నార్త్ అమ్మాయి హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలంటే అమ్మ కూడా మాట వినాల్సిందే. కూతురు భవిష్యత్తు కోసం తల్లి చేసే త్యాగాలలో ఇదీ ఒకటి.

చెప్పాలంటే ఓ కన్న తల్లి కూతురు బాగుకోసం ఎలాంటి పనినైనా చేయవచ్చు. బొచ్చపట్టుకొని అడుక్కోవచ్చు..కడుపు నింపవచ్చు. తప్పు లేదు. పాపం అంతకన్నా కాదు. కానీ, తల్లే కూతురుకి లైన్ క్లియర్ చేస్తూ పక్క పంచాల్సి వస్తోంది. ఇది జగమెరిగిన సత్యం. భాష ఏదైనా షూటింగ్స్ కి హీరోయిన్ తల్లి కూడా వస్తున్న సందర్భాలు తరుచుగా ఉంటాయి. ఇక్కడ కూతురుని రిజెక్ట్ చేస్తే తల్లి గుండే తరుక్కుపోతుంది. అందుకే, కూతురు కోసం తల్లి కమిట్‌మెంట్ ఇస్తున్న సందర్భాలుంటున్నాయి.

ఇలా ఇటీవల కాలంలో బాగా చక్కర్లు కొట్టిన వార్త మెగా హీరో సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై వరుసగా అరడజను సినిమాలు చేసేసిన కుర్రభామ. ఆ బ్యూటీ చేసిన సినిమాలలో కొన్ని హిట్స్ ఇంకొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. అన్నీ యంగ్ హీరోలతో చేసిన సినిమాలే. ఇదే సమయంలో కాస్త అటుఇటుగా ఇండస్ట్రీకి పరిచయమైన మరో యంగ్ బ్యూటీ స్టార్ హీరోల సరసన చేస్తోంది.

ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న హీరోల సరసన నటించడం సాహసం. అందుకే ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ భామకి అమ్మ అండదండలు బాగా ఉన్నాయట. కాబట్టే కూతురు స్టార్ డం ని ఎంజాయ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది.