జూనియ‌ర్ ఎన్టీఆర్ చేసిన ప‌నికి బ‌తుకుతాన‌ని అనుకోలేదు… జేడీ చ‌క్ర‌వ‌ర్తిని ఇంత వ‌ణికించాడా..!

టాలీవుడ్ ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ఏ విషయం గురించి అయినా, ఎవరితోనైనా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాడు. అయితే ఇటీవలే జేడీ చక్రవర్తి ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో చాలా విషయాలను సూటిగా నిజాయితీగా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. తాను నటించిన గులాబీ సినిమాలోని ‘మేఘాలలో తెలిపోతున్నది ‘ పాట జూనియర్ ఎన్టీఆర్ కి ఫేవరెట్ సాంగ్ అని చెప్పాడు.

కళ్లు మూసుకుని 120 కిలోమీటర్ల స్పీడ్ తో డ్రైవ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. అలా భయపెట్టాడంటూ | jd chakravarthy shocking comments about junior ntr detaisl here goes viral in social ...

జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి జెడి చక్రవర్తిని కారులో ఎక్కించుకుని మేఘాలలో సాంగ్ పెట్టుకొని టోలిచౌకి రోడ్డు వైపు తీసుకెళ్లాడట. ఆ సమయంలో కారును 100 – 120 స్పీడ్ తో తారక్ నడపడంతో జెడి చక్రవర్తికి చాలా భయమేసేదట. తారక్ 60 స్పీడ్ తో వెళ్ళినప్పటికి జేడికి భయమేసేదని చెప్పాడు. కార్ నడుపుతూ దారి మధ్యలో కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుందని తారక్ జేడీ ని అడిగేవాడట.

తారక్ అలా అడగ్గానే ఇంకెక్కువగా భయపడే వాడినని జెడి చెప్పాడు. అప్పుడు జేడి కళ్ళు మూసుకునేది నువ్వా, నేనా అని తారక్ ని అడిగితే ‘నేనే కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తాను ‘ అని ఎన్టీఆర్ చెప్పేవాడట. అప్పుడు జెడి చక్రవర్తి ‘ నువ్వు కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేస్తే మనిద్దరం శాశ్వతంగా కళ్ళు మూసుకునే పరిస్థితి వస్తుంది ఆలోచించుకో’ అని అనేవారట.

కళ్లు మూసుకుని 120 కిలోమీటర్ల స్పీడ్ తో డ్రైవ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. అలా భయపెట్టాడంటూ | jd chakravarthy shocking comments about junior ntr detaisl here goes viral in social ...

జేడి ఎన్ని చెప్పినా కూడా తారక్ వినకుండా కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేస్తూ అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూసేవాడట. కనీసం అపుడప్పుడైనా కళ్ళు తెరిచి చూసాడు కాబట్టి ఇప్పుడు నేను బ్రతికి ఉన్నాను అని జేడీ చక్రవర్తి చెప్పారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ తో ఫోన్లో టచ్ లో ఉండే వాన్ని కానీ ఇప్పుడు అసలు టచ్ లో లేనని వెల్లడించాడు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ తో జరిగిన సంఘటనని జె.డి చక్రవర్తి ఇంటర్వ్యూ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.