పెద్ద‌ కూతురు సుస్మిత‌ను హీరోయిన్‌ను చేద్దామ‌నుకున్న చిరంజీవి… అంతా ఓకే అయ్యాక ఎక్క‌డ చెడిందంటే..!

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఎంతో క్రేజ్ ఉంది. ఈ కుటుంబం నుంచి ఇప్పటికే టాలీవుడ్‌లో ఎందరో హీరోలు కొనసాగుతున్నారు. తెలుగులో హీరోలుగా చేస్తున్న వారిలో సగానికి పైగా మెగా కుటుంబం నుంచి వచ్చిన వారే. ఇంతమంది హీరోలను ఈ కుటుంబం నుంచి వచ్చిన.. హీరోయిన్‌గా మాత్రం ఎవరు ఈ కుటుంబం నుంచి ఎంట్రీ ఇవ్వలేదు. అయితే మెగా డాటర్ నిహారిక తొలిసారిగా తెలుగులో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా చేసింది.

ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తూ హీరోయిన్‌గా కూడా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయం పక్కనబెడితే మెగాస్టార్ చిరంజీవి కూడా మొదటిలో తన పెద్ద కూతురు సుస్మితని హీరోయిన్‌గా పరిచయం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారట. ఇక చిరు ముందుగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ యంగ్ హీరోకు జంటగా తన కూతురును టాలీవుడ్‌కి పరిచయం చేయాలని భావించారు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు దివంగత నటుడు ఉదయ్ కిరణ్.

గతంలో ఉదయ్ కిరణ్ – పూరీ జగనాథ్ కాంబోలో వచ్చే ఓ సినిమాలో సుస్మితను హీరోయిన్‌గా పెట్టి చిరు ఆ సినిమాని నిర్మించాలని భావించారు. ఇక అంతా సెట్ అయ్యాక సినిమా స్టోరీ కూడా మాట్లాడుకున్నాక సెకండ్ హాఫ్ అంతగా నచ్చలేదని చిరంజీవి ఆ సినిమాను క్యాన్సిల్ చేశాడు. ఇలా ఈ సినిమా షూటింగ్ మొదల‌వ్వ‌కముందే ఎండ్ కార్డు పడింది.

ఇలా చిరు తన పెద్ద కూతురు సుస్మితని హీరోయిన్‌గా చేద్దామని చేసిన తొలి ప్రయత్నమే అపశకునంగా మారడంతో ఇంకా ఎప్పుడూ తన కూతుర్లని హీరోయిన్లుగా చేయాలనే ఆలోచన చిరు రానివ్వలేదట. ఇక ప్రస్తుతం సుస్మిత టాలీవుడ్‌లో నిర్మాతగా సక్సెస్ అవ్వడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. ఇప్ప‌టికే ఓ బ్యాన‌ర్ స్థాపించి వెబ్ సీరిస్‌ల‌తో పాటు రెండు సినిమాలు కూడా నిర్మించింది.

అయితే అవేవి స‌క్సెస్ కాలేదు. దీంతో సుస్మిత ఇప్పుడు ఏకంగా త‌న తండ్రిని హీరోగా పెట్టి కుర‌సాల క‌ళ్యాన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా బ‌డ్జెట్ ఏకంగా రు. 100 కోట్ల‌కు పైనే అంటున్నారు.