బాలయ్యకు అల్లుడు కావాల్సిన స్టార్ హీరో… ఆఖరి నిమిషంలో అదృష్టం మిస్‌…!

టాలీవుడ్ లోనే ప్రస్తుతం నట‌సింహ బాలకృష్ణ ఎవరు ఊహించిన విధంగా దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంటూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో మ‌రో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య. ప్రస్తుతం అనిల్ రావిపూడి తో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా దసరా కానుకగా ప్రేక్షకుల‌ ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య తన 109వ సినిమాను మ‌రో యువ‌ దర్శకుడు బాబితో కమిట్ అయ్యాడు. ఈ సినిమాని కూడా సంక్రాంతి బారీలో దించడానికి రెడీగా ఉన్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అవుతావు టాలీవుడ్‌కే దడ పుట్టిస్తున్నాడు బాలయ్య. కాగా ఈ సమయంలోనే బాలకృష్ణ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మిణిని టాలీవుడ్‌లో ఉండే ఓ స్టార్ హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలని బాలయ్య భావించారట.

ఇదే విషయాన్ని సదరు స్టార్ హీరో తండ్రికి కూడా చెప్పారట. ఇద్దరూ కూడా ఓకే అనుకున్నారు… కానీ అదే సమయంలో ఆ హీరో వేరే అమ్మాయితో ప్రేమలో ఉండటం.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వటం… ఇవన్నీబాలయ్యకు న‌చ్చ‌క‌పోవ‌డంతోనే బ్రాహ్మణికీ ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేశారట. అయితే ఆ స్టార్ హీరో తండ్రికి తన కొడుకు ప్రేమలో ఉన్నాడనే విషయం తెలియక బాలకృష్ణకు మాటిచ్చేసాడట.

అయినా సరే బాలయ్య పెద్ద మనసు చేసుకొని పిల్లలకు ఇష్టం లేకుండా పెళ్లి చేయకూడదంటూ ఆ హీరోతో పెళ్లిని క్యాన్సిల్ చేశాడట. ఇక ఆ హీరో మ‌హేష్‌బాబు అన్న ప్ర‌చారం కూడా అప్ప‌ట్లో అయితే వినిపించింది. మ‌రి ఇందులో నిజానిజాలు వాళ్ల‌కే తెలియాలి. ఆ తర్వాత బాలకృష్ణ, బ్రాహ్మణిని లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. ప్రస్తుతం నారా బ్రాహ్మణి త‌న ఫ్యామిలీ లైఫ్‌లో ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా అగ్ర పారిశ్రామికవేత్తగా కూడా పేరు తెచ్చుకుంది.