తాత‌తో చిరునవ్వులు చిందిస్తున్న ఈ బుడతడు టాలీవుడ్ స్టార్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా…!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వింత విషయాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. అందులో సినీ సెలబ్రిటీల గురించి ప్రతి విషయం నిమిషాల్లో వైరల్ గా మారుతుంది. వారి గురించి ఎలాంటి విషయమైనా తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇదే సమయంలో తమకు ఇష్టమైన హీరో, హీరోయిన్ల వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంటారు.

అదే సమయంలో సెలబ్రెటీలు సైతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వారి ప్రతి విషయాన్ని వారి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో ఈ రీసెంట్ టైమ్స్‌లో స్టార్ హీరోలకు, హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఓ పాన్ ఇండియా హీరో చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పై ఫోటోలో తాతయ్యతో కలిసి ఎంతో ముద్దుగా నవ్వుతున్న ఈ బుడ్డ బాబు టాలీవుడ్ లోనే స్టార్ హీరో. ఇతడికి తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక ఆ హీరో ఎవరో చూద్దాం. ఆ చిరునవ్వులు నవ్వుతున్న బుడుత‌డు ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ వరుస సినిమాలు చేసుకుంటూ భారీ విజయాలతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా భారీ క్రేజ్‌ అందుకున్నాడు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్‌ సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా రీసెంట్ గానే తండ్రిగా ప్రమోట్ అయ్యాడు ఈ మెగా హీరో.