నాగశౌర్యతో లిప్ లాక్ అంత బాగుంటుందా..?..ప‌చ్చిగా బోల్డ్ ఆన్సర్ ఇచ్చిన మాళవిక నాయ‌ర్‌..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడానికి ఏ విధంగా కష్టపడాల్సి ఉంటుందో పలువురు ముద్దుగుమ్మలు కళ్లకు కట్టినట్టు క్లియర్గా చెప్పేశారు . ఎన్నో త్యాగాలు చేయాలి ..మరెన్నో కష్టాలను ఎదుర్కోవాలి ..టాలెంట్ ఉండాలి .. కృషి పట్టుదల ఉంటేనే అలాంటి ఓ స్దానానికి రీచ్ అవ్వగలము అంటూ ఎంతో మంది హీరోయిన్స్ చెప్పుకొచ్చారు. కానీ అలా అన్నీ ఉన్న హీరోయిన్స్ కూడా ఒహేడ్ అవుట్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో మిగిలిపోయారు.

వాళ్ళల్లో ఒకరే మాళవిక నాయర్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన నటనతో ప్లస్ మార్కులు వేయించుకుంది. పాజిటివ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . అంతేకాదు గ్లామరస్ పరంగా ఎన్ని రోల్స్ వస్తున్నా సరే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర లనే చూస్ చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది . కాగా మాళవిక నాయర్ చివరిగా నటించిన సినిమా థాంక్యూ. ఈ మూవీ డిజాస్టర్ గా మారింది .

Malavika Nair Hot Stills | Veethi

అయినా సరే అమ్మడు ఈ సినిమాతో విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందించుకుంది . కాగా రీసెంట్గా మాళవిక నాయర్ “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా మాళవిక నాయర్ కి ఊహించని ప్రశ్న ఎదురయింది . నాగశౌర్యతో గతంలో ఆమె నటించిన రొమాంటిక్ సీన్ పై ప్రశ్న ఎదురవ్వగా ఆమె పచ్చిగా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది.

“సినిమాలో హీరోయిన్ అన్నాక అన్ని ఎమోషన్స్ ని పండించగలగాలి .ఈ సినిమాలో అలాంటి సీన్ చేసినందుకు నాకు ఏమి ఇబ్బంది గా అనిపించలేదు . అక్కడ ఆ పాత్రకు ఆ సీన్ అవసరం కాబట్టే నేను అలా చేశాను. కథలో భాగంగా కథకు అవసరమైన సన్నివేశం కాబట్టే నేను హద్దులు మీరి నటించాల్సి వచ్చింది “అంటూ మాళవిక పేర్కొంది. ఈ క్రమంలోనే మాళవిక నాయర్ లో ఇలాంటి బోల్డ్ యాంగిల్ కూడా ఉందా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. అంతేకాదు మాళవిక నాయర్ మాట్లాడిన మాటలను ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రొమాంటిక్ సీన్ కూడా ఎందుకు చేశానో అంటూ క్లారిటీగా అర్థమయ్యే విధంగా అందరికీ చెప్పింది మాళవిక నాయర్. ఇంత పిచ్చ క్లారిటీ ఉన్న హీరోయిన్ ని ఇండస్ట్రీలో ఎవ్వరైన ఆపగలరా..? నో వే.. జెట్ స్పీడ్ లో దూసుకుపోవాల్సిందే..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, viral news