వైసీపీ ఎమ్మెల్యేకు బాల‌కృష్ణ ద‌బిడి దిబిడి మాస్ వార్నింగ్‌…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఓ వైసిపి ఎమ్మెల్యేకు అదిరిపోయే మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ నాయకుడివి రాజకీయ నాయకుడిలా ఉండు… నీచానికి దిగజారకు అని ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. తాను మూడో కన్ను తెరిస్తే అంటూ బాలయ్య అదిరిపోయే మాస్ వార్నింగ్ తో ఉరూతలూగించేశారు. అసలు విషయంలోకి వెళ్తే గుంటూరు జిల్లా నరసరావుపేట వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాలకృష్ణ పాటకు ఓ వైసీపీ కార్యకర్త డాన్సులు వేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేట శివారులో శివరాత్రికి కోటప్పకొండ తిరుణాల కోసం ప్రభను రూపొందించారు.

Nandamuri Balakrishna Net Worth 2023: Movie Income Career Gf

ఈ ప్రభ నిర్మాణానికి పార్టీలకు అతీతంగా భక్తులు అందరూ విరాళాలు ఇచ్చారు. అనంతరం ఆ ప్రభవద్ద డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి బాలకృష్ణ పాటలకు డ్యాన్స్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దగ్గర ఫిర్యాదు చేశాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి భాస్కర్ రెడ్డిని మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు.. కార్యకర్తలు భాస్కర్ రెడ్డిని అడ్డుకుని ఇంటికి తరలించారు.

ఇక ఆత్మహత్యాయత్నం చేసిన భాస్కర్ రెడ్డి వైసీపీ కార్యకర్త.. అతను ఎమ్మెల్యేని నమ్ముకుని పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు. తను టిడిపి పాటలు ప్రదర్శించలేదని.. సినిమా పాటలు పెట్టానని పార్టీకి వ్యతిరేకంగా కూడా పనిచేయలేదని ఎమ్మెల్యే తనను అనవసరంగా తప్పు పెట్టడం వల్ల మనస్థాపానికి గురైనట్టు భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. అయితే తన అభిమాని తన పాటకు డాన్స్ చేయ‌డం.. ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వడం.. తన అభిమాని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ విషయాన్ని కొందరు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు.

Opposition parties are behind demolition of temple idols in AP: YSRCP MLA Gopireddy  Srinivasa Reddy

దీంతో ఈరోజు తెనాలిలో పెమ్మ‌స్సాని థియేటర్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో బాలయ్య ఈ విషయంపై స్పందిస్తూ ఎమ్మెల్యే గోపిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. జాగ్రత్త హెచ్చరిస్తున్నా… చిటిక వేస్తే చాలు అంటూ వారిని ఇవ్వడంతో అక్కడ బాలయ్య అభిమానులు ఈలలు.. కేకలతో హోరెత్తించారు. ఏదేమైనా వైసీపీ ఎమ్మెల్యేకు బాలయ్య ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు మీడియాలో హైలైట్ గా మారింది

Tags: AP, ap politics, balakrishna, intresting news, latest news, latest viral news, nadamuri balakrishna, social media, social media post, telugu news, trendy news, viral news, ysrcp