మహేష్‌బాబు డైరెక్షన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ఇదే..!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేష్ బాబు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరవుతూ మరో సూపర్ స్టార్ గా అభిమానులతో పిలిపించుకున్నాడు. టాలీవుడ్ లోనే నెంబర్ వన్ స్టార్ హీరోల్లో మహేష్ బాబు మొదటి స్థానంలో ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి అప‌జ‌యం అనేది లేకుండా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు.

ఇక ప్రస్తుత మహేష్ త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. చాలా వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయం పక్కనపడితే మహేష్ బాబు తన కెరీర్లో ఇప్పటివరకు 27 సినిమాల్లో నటించాడు. అలాగే నిర్మాతగా కూడా తన సత్తా ఏంటో చూపించాడు.

అయితే ఇక్కడ ఎవరికీ తెలియని మరో విషయం ఏమిటంటే.. మహేష్ బాబు ఓ సినిమాకి డైరెక్టర్ గా కూడా వ్యవహరించాడు. పైగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు పోకిరి.
అదేంటంటే ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకుడు క‌దా అన్న డౌట్ అందరికీ వస్తుంది. ఇక్కడే ఎవరికీ తెలియని ఓ టాప్ సీక్రెట్ ఉంది.. పూరీ ఈ సినిమాను ముందుగా రవితేజతో చేయాలని భావించాడు.

అనుకోని కారణాలతో రవితేజ ఈ సినిమాను వదులుకున్నాడు. ఆ తర్వాత పూరీ- మహేష్ వద్దకు వచ్చాడు.
మహేష్ కు ఈ సినిమా స్టోరీ నచ్చినప్పటికీ స్క్రిప్ట్ లో ఏదో మిస్ అవుతుందని మహేష్ బాబుకు అనిపించింది. దాంతో పూరీ అంగీకారంతోనే మహేష్ బాబు పోకిరి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేశాడు. తర్వాత ఫైనల్ గా సినిమాను మొదలుపెట్టారు.

ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. పోకిరి సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలను మహేష్ బాబు డైరెక్షన్లో తెరకెక్కాయ‌ట. ప్రధానంగా ఈ సినిమాలో వచ్చే షెడ్డు ఫైట్ మొత్తం మహేష్ కంపోజ్ చేయించుకుని మరి నటించార‌ట. ఈ విధంగా మహేష్ డైరెక్షన్లో వచ్చిన తొలి సినిమా పోకిరి అని చెప్పాలి.ఈ సినిమా మహేష్ కు ఓ మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయింది.