ఆ హీరోయిన్‌కు బ‌ల‌వంతంగా ఆ ముద్దు పెట్ట‌లేదు… ధ‌ర్మేంద్ర సంచ‌ల‌నం..!

అలియా భట్ – రణ్‌బీర్ సింగ్ జంటగా నటించిన సినిమా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని ఈ సినిమా జులై 28న విడుదలైంది. మొదటి రోజు ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్ సంపాదించుకుంది. కరణ్ జోహార్ పూర్తిగా పాత సినిమాల్లోని కథలను సన్నివేశాలను కాపీ కొట్టి సినిమాను రూపొందించాడంటు కంగనా విమర్శించింది. రూ.250 కోట్లు ఈ సీరియల్ సినిమాకు పెట్టడం దండగ‌ అంటూ కామెంట్స్ చేసింది. అయితే ఈ సినిమాకి చాలామంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

ఈ సినిమాలో యంగ్ కపుల్ ఆలియా – రణ్‌బీర్ తో పాటు ఓల్డ్ కపుల్ ధర్మేంద్ర – షబానా ఆజ్మీ కీరోల్ ప్లే చేశారు. ఆలియా – రణ్‌బీర్ రొమాన్స్ తో అభిమానులను ఆకట్టుకోగా.. ఓల్డ్ కపుల్ ధర్మేంద్ర – షబానా ఆజ్మీల మధ్య ముద్దు సన్నివేశం కొంతమంది విమర్శలకు దారితీసింది. ఈ వయసులో ముద్దు సీన్‌ అవసరమా అంటూ కొంతమంది ఈ జంట‌పై ఫైర్ అయ్యారు. ఈ అంశంపై ఇటీవల ధర్మేంద్ర మాట్లాడుతూ ష‌బానాతో మూతిముద్దు రించి వివరించాడు.

నిజానికి ఈ సన్నివేశంలో ఇద్దరు తారలు కొంత కాలం విడిపోయి క‌లిస్తే ఎలా ? ఒకరిని ఒకరు రిసీవ్ చేసుకుంటార‌న్న‌ది చూపించారని.. పాపులర్ రెట్రో సాంగ్ అభి నా జావో చోడ్ కర్ అనే పాట పాడుతాడు.
ల‌వ్ ఫీలింగ్‌ ముద్దుతో వారి పునః కలయికను గ్రాండ్గా తెలుపుతాడంటూ ధర్మేంద్ర మాట్లాడారు. నేను, షబానా ముద్దు సన్నివేశంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నామని. అంతా అంటుంటే విన్నాను అదే టైంలో వారు ఆ సన్నివేశాన్ని చూసి క్లాప్స్ కొట్టారని తెలుసు.

ప్రజలు ఊహించనిది ఆకస్మాత్తుగా తెరపై కనిపిస్తే అది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. నేను చివరిసారిగా సాఫీసా ఆలీతో కలిసి లైఫ్ ఇండియా మెట్రోలో ముద్దు సన్నివేశంలో నటించిన సమయంలో కూడా ప్రజలు ఆ ముద్దు సీన్లు మెచ్చుకున్నార‌ని వివరించాడు. ఇప్పుడు నాకు 87 ఏళ్లు వయసు అని.. ప్రేమకి వయసుతో సంబంధం లేదని కరణ్‌ నాకు ఈ సన్నివేశాన్ని వివరించినప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవని అది ఆ సందర్భంలో ఖచ్చితంగా అవసరమైన సీన్ కావడంతో నేను డైరెక్టర్‌కి ఓకే చెప్పానని వివరించాడు. అలాగే ఈ సన్నివేశం షూటింగ్ టైంలో కూడా నేను కానీ షబానా కానీ ఎటువంటి ఇబ్బంది పడలేదు అంటూ వివరించాడు.