కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా వచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని తన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చే విధంగా రజనీకాంత్ …ఆయన పేరుని మలుచుకున్నాడు అంటే ఆయనలో ఎంత టాలెంట్ ఉందో ..ఎంత కసి -పట్టుదల -కృషి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వయసు 72 దాటిపోతున్న సరే ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు అంటే ఆయనకు సినిమాలంటే ఎంత ఇష్టం ఎంత ప్రాణం అనే విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది .
కాగ రజినీకాంత్ మొదటి నుంచి చాలా ఫన్నీగా జోవియల్ గా చిల్ అవుతూ ఉంటారు . అంతేకాదు తాను పనిచేసే సినిమా షూటింగ్ టైంలో ఎవరైనా సరే డల్ గా ఉన్న రజినీకాంత్ కి నచ్చదట . తాను ఎక్కడ ఉంటే అక్కడ స్మైలీ ఫేసెస్ కనిపించాలని సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలని రజనీకాంత్ చెప్పుకొస్తూ ఉంటాడట . ఈ క్రమంలోనే తాను వర్క్ చేసే హీరోయిన్స్, కమెడియన్స్, కో ఆర్టిస్టులు ఎవరైనా డల్ గా ఉన్నా సరే వెళ్లి వాళ్ళ మూడ్ ని మార్చడానికి బాగా ఎక్కువగా ట్రై చేస్తారట .
వాళ్లతో నాకేం సంబంధం..? అనుకోకుండా వాళ్ళ బాధలను తెలుసుకొని తీర్చడానికి ట్రై చేస్తారట. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్ లను సైతం రజినీకాంత్ తన చిలిపి పనులతో సీరియస్ మూమెంట్లో కూదా సరే నవ్విస్తూ మళ్ళీ నార్మల్ మూడ్లోకి తీసుకొచ్చారని .. ఆ కేటగిరీలోకి ఆయనతో వర్క్ చేసిన రమ్యకృష్ణ – నగ్మా – మీనా – సౌందర్య లాంటి హీరోయిన్స్ వస్తారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి . ప్రెసెంట్ రజనీకాంత్ జైలర్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా భాటియా నటించింది. కాగా ఆగస్టు 10న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది..!!