నేను శైలజా సినిమాలో రామ్‌కు జోడిగా నటించి తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ అనతికాలంలోనే అగ్రనాయికగా స్థానాన్ని సంపాదించుకుంది. దక్షిణాదిలో టాప్ హీరోహియిన్లలో ఒకరుగా కొనసాగుతున్నది. ‘మహానటి’తో స్టార్ స్టేటస్‌తో పాటు గొప్పనటిగా నిరూపించుకుని ఏకంగా జాతీయ పురస్కారాన్ని కూడా కైవసం చేసుకుంది. వరుస సినిమాలు.. విజయాలతో సినీ పరిశ్రమంలో దూసుకుపోతున్నది. మహానటి సినిమా తరువాత కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది కీర్తి. అందులో భాగంగా కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా’లో నటిస్తోంది.
ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తుండగా, నరేంద్ర నాథ్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్ స్వరాలను సమకూర్చుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదల కాగా విశేష స్పందన లభించింది. ఈ మిస్ ఇండియా సినిమాలో కీర్తి గతంలో ఎన్నడూ చేయని ఓ ప్రత్యేక పాత్రను చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టినట్లు నిర్మాత మహేష్ కోనేరు ప్రకటించాడు. ఈ డబ్బింగ్‌లో కీర్తి పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సినిమాలో మిగితా ముఖ్య పాత్రల్లో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఓ స్పోర్స్ డ్రామాలో కూడా కీర్తి నటిస్తున్నది. ఆ మూవీ ఫస్ట్ లుక్‌ను కీర్తి బర్త్‌డే సందర్భంగా విడుదల చేయగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నది. ఆ సినిమాతో పాటు కీర్తి సురేష్ పెంగ్విన్, గుడ్ లక్ సఖి, తెలుగులో నితిన్‌తో రంగ్‌దే అనే సినిమాలో కీర్తి నటిస్తున్నది. తమిళ్‌లో కూడా ఈ మహానటి అదరగొడుతోంది. రజనీకాంత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో వస్తోన్న ఓ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్నది.