దిశా కేసు రేపిస్ట్ భార్య‌తో రామ్‌గోపాల్ వ‌ర్మ చ‌ర్చ‌లు

ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా సంచ‌న‌లం రేపిన దిశా ఉదంతాన్ని సినిమాగా తీస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన మ‌రో సంచ‌ల‌నం రేపారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. రేపిస్ట్‌లు భ‌య‌ప‌డేలా సినిమాను తీస్తాన‌ని, అలాంటి స‌న్నివేశాలే త‌న సినిమాలో ఉంటాయ‌ని వెల్ల‌డించి అంద‌రిలో ఆస‌క్తి రేపారు. ఇప్ప‌డిదే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించే త‌డవుగా అందుకు సంబంధించిన ప్ర‌య‌త్నాల‌ను కూడా ముమ్మ‌రం చేశాడు ఆయ‌న‌. ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అధ్య‌య‌నం చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి అంత‌మొందించ‌డం, ఆపై వారు పోలీసుల ఎన్‌కౌంట‌ర్లో వారు మృతి చెంద‌డం వ‌ర‌కూ అన్ని అంశాల‌ను కూల‌క‌షంగా అధ్య‌య‌నం చేస్తున్నారు.

తాజాగా ఇప్పుడు మ‌న వర్మ దిశ రేపిస్ట్‌లలో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక వర్మను ప్ర‌త్యేకంగా క‌లిశాడు. ఆమెను తన కార్యాల‌యాన‌కి ఆహ్వానించి కేసుకు సంబంధించిన ప‌లు కీలక విషయాల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని ట్విట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. దాని తోపాటుగా ‘‘రేపిస్ట్ చెన్నకేశవులు భార్య రేణుకను కలవడం జరిగింది. 16 వయసులోనే రేణుక పెళ్లి చేసుకుని, 17 ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. దిశనే కాదు ఆ రాక్షసుడు రేణుకను కూడా మోసం చేశాడు. వారిద్దరికీ ఇప్ప‌డు భవిష్యత్తు లేదు’’ అని మండిపడ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌డు ఆ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రోవైపు సినీ ప్రేక్ష‌కుల్లో సినిమాను ఏ స్థాయిలో తెర‌కెక్కిస్తాడోన‌ని ఆస‌క్తిని రేపుతున్నాయి.

Tags: dhisha case, RamGopal Varma, repist chenna keshavulu wife