సరిలేరు నీకేవ్వరు సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రిన్స్ మహేష్‌బాబు. అందుకోసం కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లాడు. కానీ తన తరువాతి సినిమా ప్రయత్నాలను కూడా ముమ్మరం చేస్తున్నారు.
మహర్షి వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన వంశీ పైడిపల్లితో ఈ రాజకుమారుడు తన 27వ చిత్రాన్ని చేసేందుకు ఇప్పటికే గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో మరి ప్రిన్స్‌కు జోడి కట్టేదేవరని ఊహాగానాలు బయలు దేరాయి. పలువురు అగ్రహీరోయినట్ల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇక వాటికి తెరపడినట్లేని తెలుస్తున్నది. మహేష్ సరసన భర్‌త్ అనే నేను చిత్రంలో నటించిన కియారా అద్వానీనే మరోసారి జోడి కట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉండగా, మహేష్‌బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ, ఆ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ చిత్రం హిట్ తర్వాత బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన వినయవిధేయ రామ మూవీలో రామ్ చరణ్ సరసన జంటగా నటించింది. తన అందచందాలతో ఆకట్టుకున్నది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడడంతో తెలుగు సీని పరిశ్రమంలో ఈ భామకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితేనేం బాలివుడ్‌లో తెలుగు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్‌సలో చాన్స్ కొ్ట్టేసింది. ఆ సినిమా ఊహించిన దానికంటే స్థాయిలో హిట్ అందుకోవడంతో మళ్లీ సినిమా అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న కామెడీ హర్రర్ మూవీ ‘లక్ష్మీబాంబ్’ లో నటిస్తోంది కియారా. ఇప్పడు మహేష్ సినిమాలో మరోసారి చాన్స్ కొట్టేసిందని తెలుస్తున్నది. మహేష్‌బాబు స్వదేశానికి తిరిగివచ్చాక సమ్మర్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.