క‌ళ్యాణ్‌రామ్ హీరోయిన్‌కు ఇంత టాప్ బ్యాక్‌గ్రాండ్ ఉందా…. ఎవ‌రో తెలుసా..!

టాలీవుడ్ లో విదేశీ భామల హంగామా కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాతో ఇరానీ భామ ఇక్కడ మెరుపులు మెరిపించేందుకు రెడీ అవుతోంది. ఇటీవల అమీగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ త్వరలోనే డెవిల్ సినిమాతో మరోసారి థియేటర్లలోకి దిగనున్నాడు. ఈ సినిమాలో ఇరానీ భామ ఎల్నాజ్ నొరౌజీ ఓ స్పెషల్ సాంగ్ తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

Elnaaz Norouzi

సాక్రేట్ గేమ్స్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్లో మెప్పించిన ఈ భామ ఇప్పుడు టాలీవుడ్లోకి డెవిల్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇరాన్ లోని టెహ్రాన్‌లో ఆమె జన్మించింది. అనంతరం ఆమె జర్మనీలో పెరిగి అక్కడే విద్యను అభ్యసించింది. టీనేజ్ లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. ప‌లు అంతర్జాతీయ బ్రాండ్స్ ప్రచార చిత్రాలలోనూ నటించింది. పదేళ్లపాటు మోడలింగ్ చేసి… ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

Elnaaz Norouzi (@_iamnaaz_) / Twitter

చూడటానికి ఆమె ఫేస్ కట్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాగా ఉండడంతో సల్మాన్ ఖాన్ కూడా ఆమెను ప్రోత్సహించాడు. అందుకే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తో కలిసి పలు ప్రచార చిత్రాల్లోనూ మెరిసింది. ఆ తర్వాత సాక్రేట్ గేమ్స్ తో బాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత ఒక పంజాబీ సినిమాతో పాటు పలు నార్త్ ఇండియన్ వెబ్ సిరీస్‌లు, సినిమాలలో నటించింది. అలాగే మ్యూజిక్ ఆల్బమ్స్ లో కనిపించి తన మ్యాజిక్ ఏంటో చూపించింది.సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే జర్మనీలోనే నటనలో శిక్షణ తీసుకుంది. అలాగే అక్కడ నాటకాలు కూడా వేసింది. ఆమె మంచి డ్యాన్సర్ చిన్నప్పుడే సంప్రదాయ నృత్యంతో పాటు హిప్ హాప్ కూడా నేర్చుకుంది.

Elnaaz Norouzi (Actress) Height, Weight, Age, Boyfriend, Family, Biography  & More » StarsUnfolded

ప్రస్తుతం ఇండియాలో కథ‌క్‌ డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఇక తన శరీరాన్ని ఎప్పుడు ఫిట్‌గా ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా యోగా డ్యాన్స్ చేస్తుందట. అలాగే మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తోంది.ఆమె బహు భాషా కోవిదురాలు అనే చెప్పాలి. జర్మనీతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలలో అనర్గళంగా మాట్లాడుతుంది. మాస్టర్ డిగ్రీ చేసిన ఎల్లాజ్ మంచి ఫిలాసఫర్ కూడా. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్ అప్డేట్స్ తో పాటు.. మంచి స్ఫూర్తినిచ్చే వ్యాఖ్యలు, కొటేషన్లు కూడా రాస్తూ ఉంటుంది. ఇక జర్మనీలో ప్రచురితమయ్యే ఫోకస్ మ్యాగజైన్ రూపొందించిన టాప్ – 100 అఫ్ ది ఇయర్ 2023లో కూడా ఆమె చోటు దక్కించుకుంది.ఇక తన మాతృభూమి ఇరాన్ లో జరుగుతున్న దురాగతలపై ఆమె ఎప్పటికప్పుడు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంటుంది. ఈ గ్లామరస్ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్ లో ఏకంగా 2.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరి తెలుగులో కళ్యాణ్ రామ్ డెవిల్ తో ఎంటర్ అవుతున్న ఆమె కెరీర్ ఇక్కడ ఎలా ? ఉంటుందో చూడాలి.

Tags: film news, filmy updates, intresting news, Kalyan Ram, latest news, latest viral news, Nandamuri Family, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news