ఉత్తరాంధ్ర గెలుపు క్రెడిట్.. బావి నిండాక మొరిగే తొలి కప్ప గంటా శ్రీనివాసే… శ్రీ భరత్ ఏమైనట్టు..!

ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఏకంగా 38వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. వాస్తవంగా ఈ సీటు కోసం టీడిపి.. బీసీ మహిళ అయిన విశాఖ నగర కార్పొరేటర్ ను ముందుగా ఎంపిక చేసింది. అయిన పాత్రుడు సిఫారసు మేరకే చంద్రబాబు ఆమె పేరు ప్రతిపాదించినట్టు ప్రచారం జరిగింది. అయితే చివరిలో అనూహ్యంగా చిరంజీవి రావు రంగంలోకి దిగారు.

Andhra Pradesh: TDP MLA Ganta Srinivasa Rao Requests Speaker To Accept His  Resignation

పార్టీ నేతలు అందరూ కష్టపడ్డారు మూడు జిల్లాల నాయకులు బాగా కృషి చేశారు. దీనికి తోడు వైసీపిపై ఉన్న వ్యతిరేకతతో పాటు వైసీపీ నేతలు విశాఖను రాజధానిగా చేస్తామంటూ చేసిన అరాచకాలు, భూకబ్జాలను దారుణంగా తిప్పుకొట్టి టీడిపిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే ఈ గెలుపు క్రెడిట్ ఇప్పుడు ఎవరి ? ఖాతాలో వేసుకుంటారు అన్నదానిపై చర్చ మొదలైంది.

Sri Bharat confident of TDP retaining power

అనూహ్యంగా ఇక్కడ టీడిపి విజయం సాధించడంతో.. ఇప్పుడు ఆ క్రెడిట్ మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు ఖాతాలో వేసేందుకు ఆయన అభిమానులు.. అనుచరులు రంగంలోకి దిగారు. అసలు చిరంజీవిరావును అభ్యర్థిగా ఎంపిక చేయటం వెనక గంటా చక్రం తిప్పారని.. అయ్యన్నపాత్రుడు సిఫార్సు చేసిన అభ్యర్థిని కాదని గంటా చిరంజీవి పేరును సూచించారని డప్పులు మొదలుపెట్టేశారు.

అసలు పార్టీ గ‌త‌ ఎన్నికలలో ఓడిపోయాక గంటా ఏనాడు బయటకు రాలేదు. అసలు విశాఖలో జరిగిన పార్టీ సమావేశాలకు కూడా ఏనాడు హాజరు కాలేదు. రెండేళ్లపాటు గంటా పార్టీ ఆఫీస్ గుమ్మం కూడా తొక్కలేదు. చంద్రబాబు, లోకేష్ పై అధికార వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసిన మౌనంగా ఉంటూ వచ్చారు. మధ్యలో వైసీపీలోకి వెళ్లి పోతారన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. ఆ తర్వాత జనసేనలోకి వెళతారన్న పుకార్లు కూడా బయటకు వచ్చాయి. ఏం జరిగినా గంటా సైలెంట్ గా ఉంటూ వచ్చారు.

Sri Bharat Archives | Telugu360.com

ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు మొదలయ్యాయి. దీంతో గంటా నోరు మెదపటం ప్రారంభించారు. వ్యూహాత్మకంగానే గంటా అనుచరులు ఉత్తరాంధ్ర గెలుపుకు క్రెడిట్ ను గంటా ఖాతాలో వేసేందుకు చాప కింద నీరులా ప్రచారం ప్రారంభించేశారు. వాస్తవంగా చూస్తే గంటా అవకాశవాది అని… ఆయన అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. తెలుగుదేశం ఓడిపోయాక నాలుగేళ్ల పాటు విశాఖ జిల్లాకు చెందిన మరో మంత్రి అయ్యన్నపాత్రుడు ఎంతో పోరాటం చేశారు. కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఆయన తనయుడు చింతకాయల విజయ్ కూడా ఐ టీడిపి వింగ్‌ పటిష్టం చేయటంలో ఎంతో కష్టపడ్డారు. ఆయనపై కూడా కేసుల నమోదు అయ్యాయి.

గంటా మాత్రం నాలుగేళ్ల పాటు ఇంట్లో కూర్చుని ఇప్పుడు బయటకు వచ్చి హడావుడి చేయటం వెనక కేవలం టీడిపి అధికారంలోకి వస్తుందన్న ఆశతోనే అని టీడిపి వాళ్ళే విమర్శిస్తున్నారు. ఎలాగూ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ మంత్రి పదవి దక్కించుకోవచ్చు అన్న ప్లాన్ తోనే గంటా ఇప్పుడు యాక్టివ్ అవుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీని గెలిపించే బాధ్యతలను చంద్రబాబు లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ కు అప్పగించారు. విశాఖ జిల్లాలో ఆయన తన వంతుగా కష్టపడ్డారు.

పోలీసులకే న్యాయం జరగడం లేదు.. Chintakayala Ayyanna Patrudu ఆగ్రహం | Former  minister Chintakayala Ayyanna Patrudu criticized Cm Jagan

అటు అయ్యన్నపాత్రుడు తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కష్టం కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు వాళ్లంతా తెరమరుగు అయిపోయి గంటాకు ఈ క్రెడిట్ ఇచ్చేయడం చూస్తుంటే బావి నిండాక మొరిగే తొలి కప్ప గంటాయే అని టిడిపిలోనే ఆయన వ్యతిరేకులు విమర్శలు చేస్తున్నారు. గంటాతో చంద్రబాబు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు .

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp