లావణ్య-వరుణ్‌ల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం అల్లు అరవిందా..? ఈ వీడియోనే సాక్ష్యం..!!

మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నాయి. నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠితో తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. గతకొంత కాలంగా వీరిద్దరి పెళ్లిపై వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఈ జంట తమ బంధాన్ని నిశ్చితార్థంతో మరింత బలంగా మార్చుకున్నారు. అయితే, అసలు వరుణ్-లావణ్యలు ఎప్పటినుండి ప్రేమలో పడ్డారా.. అసలు వీరి గురించి మెగా ఫ్యామిలీలో ముందుగా ఎవరు తెలుసుకున్నారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

కాగా, లావణ్య-వరుణ్ తేజ్‌ల బంధాన్ని ముందుగా గుర్తించింది మరెవరో కాదు.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. అవును.. ఇది నిజం. గతంలోనే ఓ సినిమా ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠిని పొగుడుతున్న తరుణంలో, అల్లు అరవింద్ ఓ కామెంట్ చేశారు. నార్త్ నుండి వచ్చి, తెలుగులో చాలా చక్కగా నటిస్తున్న లావణ్య, త్వరలోనే ఇక్కడే ఓ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలని సూచించాడు.

అయితే, సినిమా ప్రమోషన్స్‌లో అల్లు అరవింద్ చేసిన కామెంట్‌ను లావణ్య త్రిపాఠి సీరియస్‌గా తీసుకుందని.. అందుకే మెగా ఫ్యామిలీకే చెందిన వరుణ్ తేజ్‌తో లవ్‌లో పడి, ఇప్పుడు నిశ్చితార్థం వరకు వచ్చిందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

 

 

Tags: allu aravaind, celebrities news, latest film news, latest filmy updates, latest news, Lavanya, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news