న‌ట‌సింహం బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌తో ర‌చ్చ చేసిన ఆస్ట్రేలియా క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ ( వీడియో)

ప్రస్తుతం నందమూరి నట‌సింహాం బాలకృష్ణ మేనియా న‌డుస్తోంది. అటు బుల్లితెర‌పై చూసినా.. ఇటు వెండితెర‌పై చూసినా బాల‌య్య జోష్ మామూలుగా లేదు. బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ షోతో మ్యాజిక్ చేసిన బాల‌య్య వెండితెర‌పై అఖండ‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు బ్యాక్‌టు బ్యాక్ హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలో న‌టిస్తున్నాడు.

ఈ సినిమాతో బాల‌య్య మ‌రో అదిరిపోయే బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక బాల‌య్య అన్నా… బాల‌య్య సినిమాలు అన్నా ముందుగానే మ‌న‌కు గుర్తొచ్చేది ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు గుర్తుకు వ‌స్తాయి. పంచ్‌లు పేలిపోతాయి. ఇక ఇటీవ‌ల మ‌న తెలుగు సినిమాలు, తెలుగు హీరోలు చెప్పిన డైలాగుల‌ను స్టార్ క్రికెట‌ర్లు ప‌ల‌క‌డం, వాటికి డ్యాన్సులు వేయ‌డం ఓ ట్రెండింగ్‌గా మారింది.

తాజాగా బాల‌య్య డైలాగులు ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ ప‌ల‌క‌డం విశేషం. తెలుగు అస్స‌లు రాని స్మీత్ బాల‌య్య డైలాగులు చ‌క్క‌గా ప‌లికాడు. స్మిత్ బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు చెపుతుంటే చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. స్టార్స్‌స్టోర్ట్స్ వాళ్లు స్మిత్‌తో తెలుగులో బాల‌య్య డైలాగులు చెప్పించారు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడో ఓ రేంజ్‌లో వైర‌ల్‌గా మారింది.

NBK 107 First Hunt: Powerfully Portrayed | NBK 107 Film News

ఇక ఈ రోజు బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా అయితే ఈ వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ వరల్డ్ కప్ ఫైనల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ మ్యాచ్ బ్రాడ్ కాస్ట్ సంస్థ స్టార్ వారు అయితే తెలుగు నుంచి స్టీవ్ స్మిత్ తో ఈ బైట్స్ తీసుకోవడం జరిగింది. దీనితో స్టీవ్ చెప్పిన ఈ డైలాగ్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.