మ‌హేష్‌ను నిలువునా పాతాళానికి ముంచేశాడు… బాల‌య్య‌ను ఆకాశానికి లేపేశాడు…!

టాలీవుడ్ న‌ట‌సింహం బాల‌య్య తాజా సినిమా భ‌గ‌వంత్ కేస‌రి టీజ‌ర్ వ‌చ్చేసింది. ఈ రోజు బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌చ్చిన టీజ‌ర్ ఆద్యంతం దుమ్ము రేపేసింది. బాల‌య్య చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగులుబాగా పేలాయి. బాల‌య్య‌ను చాలా కొత్త‌గా ఆయ‌న యాక్ష‌న్ స్టైల్లో అనిల్ రావిపూడి చూపించిన విధానం బాగుంది. ఇక బాల‌య్య‌ మోడ్ లోకి ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి పూర్తిగా మారిపోయినట్లు టీజర్ చెప్ప‌క‌నే చెప్పేసింది.

అనిల్ రావిపూడి ఎంట‌ర్టైన్‌మెంట్ ట‌చ్చ్ కూడా అదిరింది. ఇక థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం అదిరిపోయింది. అఖండ‌కు థ‌మ‌న్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్‌లో సినిమాను ఎలివేట్ చేసింది. అస‌లు అమెరికాలో స్పీక‌ర్లు పేలిపోవ‌డంతో వాళ్లు మేం సౌండ్ త‌క్కువుగా పెడుతున్నాం అని ముందే చెప్పేశారు. ఇప్పుడు భ‌గ‌వంత్ కేసరి టీజ‌ర్‌ను థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం ఆద్యంతం ఎలివేట్ చేసింది.

సినిమా మీద హైప్ పెంచ‌డానికి.. మార్కెట్ పెర‌గ‌డానికి థ‌మ‌న్ ఆర్ ఆర్ ఎంతైనా హెల్ఫ్ అయ్యింది. ఆ రేంజ్‌లో బాల‌య్య సినిమాను థ‌మ‌న్ ఆకాశానికి లేపాడు. ఇక అదే కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన మ‌హేష్ గుంటూరు కారం టీజ‌ర్ నేప‌థ్య సంగీతం, భ‌గ‌వంత్ కేస‌రి నేప‌థ్య సంగీతం పోల్చి చూస్తే మ‌హేష్ టీజ‌ర్ పూర్తిగా తేలిపోయిన‌ట్టే చెప్పాలి. అస‌లు గుంటూరు కారం టీజ‌ర్‌ను థ‌మ‌న్ సంగీతం ఏ మాత్రం ఎలివేట్ చేయ‌లేక‌పోయింది.

మ‌హేష్ ఫ్యాన్స్ కూడా ఇప్ప‌టికే థ‌మ‌న్‌ను ఆడేసుకుంటున్నారు. పైగా ఆ మ్యూజిక్ కూడా కాపీ అన్న విమ‌ర్శ‌లు వ‌చ్చేశాయి. అస‌లు థ‌మ‌న్ మీద మ‌హేష్‌కు ముందు నుంచి న‌మ్మ‌కాలు లేవు. అందుకు త‌గ్గ‌ట్టుగానే థ‌మ‌న్ మ‌హేష్‌ను టీజ‌ర్‌తో పాతాళంలోకి ముంచేశాడు. ఏదేమైనా స్వ‌ల్ప తేడాతో వ‌చ్చిన ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాల్లో బాల‌య్య సినిమాను త‌న ఆర్ ఆర్‌తో ఆకాశంలోకి లేపిన థ‌మ‌న్ మ‌హేష్‌ను ముంచేశాడు.

Tags: bhagavanth kesari, celebrities news, gunturu karam, latest film news, latest filmy updates, latest news, social media, Star hero, Star Heroine, telugu news, Thaman, Tollywood, viral news