ఐపీఎల్ 2023… చుక్క‌లనంటిన ‘ నీతా అంబానీ ముంబై ఇండియ‌న్స్ ‘ బ్రాండ్ వేల్యూ… క‌ళ్లు చెదిరే రేటు..!

ఐపీఎల్ 2023 పోరులో ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలుచుకునే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. ఆసియా అపరకుబేరుడు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ యాజమాన్యంలోని ముంబై ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడంతో ఈ టైటిల్ పోరు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ద్వారా అంబానీ కుటుంబం ఎంత ?అర్జించింది అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది. టాప్ సక్సెస్ఫుల్ టీమ్ గా భావించే ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీలు ఎన్ని ? వేల కోట్లు సంపాదించారో తెలిస్తే కళ్ళు జిగేల్ మంటాయి.

ఐపీఎల్ టీమ్ లో ముంబై ఇండియన్స్ లో 100% వాటా నీతా, ముఖేష్ అంబానీల‌కే ఉంది. ఈ జట్టును 2008లో నీతా అంబానీ కొనుగోలు చేశారు. తొలి సీజన్లో ఈ జట్టును కొనేందుకు రు. 916 కోట్లు వెచ్చించారు. ఇప్పటివరకు ఐదు టైటిల్స్‌ సాధించి 2023 వరకు అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు గెలుచుకున్న రికార్డు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఆదాయం ఎక్కడా తగ్గలేదు. పెద్ద సంఖ్యలో స్పాన్సర్లు ఈ జట్టుకు ఉన్నారు.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ బ్రాండ్ వేల్యూ పదివేల కోట్ల పై మాటే. విచిత్రం ఏంటంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ జట్టు బ్రాండ్ వేల్యూ ఈ యేడాది రు. 200 కోట్లు పెరిగింది. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా వృద్ధి రేటు నమోదు చేసిన ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. దీంతో పాటు టిక్కెట్ ధరలు, మీడియా స్పాన్సర్ షిప్‌లు, ప్రకటనల ద్వారా భారీగా ఈ జట్టుకు ఆదాయం దక్కుతోంది.

ఇది అంతా ఒక ఎత్తు అయితే.. జియో సినిమాకు విక్రయించిన ఐపిఎల్ హక్కుల ద్వారా వీళ్ళకు వచ్చిన ఆదాయం మరో ఎత్తు. తొలి 5 వారాల్లోనే జియో సినిమా రికార్డు స్థాయిలో 1300 కోట్ల వీడియో వీక్షణలు సొంతం చేసుకుంది. రిల‌య‌న్స్ బ్రాండ్ వ‌యాకామ్ 18, జియో సినిమా ఐపీఎల్ టెలీకాస్టింగ్ హ‌క్కుల‌ను కూడా 22,290 కోట్ల‌కు కొనుగోలు చేసింది.