‘ అఖండ 2 ‘ లో ఆ 2 హైలెట్స్‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లాల్సిందే… క్లారిటీ ఇచ్చేసిన బోయ‌పాటి..!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంత క్రేజీ ఉంటుందో తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వస్తే మూడు ఒకదానిని మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. సింహా, లెజెండ్ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు. ఇక అఖండ సినిమా అయితే ఆ రెండు సినిమాలను మించి తిరుగులేని విజయం నమోదు చేసింది. ఇంకా చెప్పాలంటే అఖండ సినిమాకు ముందు వరకు బాలయ్య రేంజ్ ఒకలా ఉంటే.. అఖండ తర్వాత మరోలా మారిపోయింది.

Music director makes 'Akhanda 2' official! - Telugu News ...

అఖండ సినిమాలో శివుడిని, శివ భక్తితో పాటు బాలయ్య నట విశ్వరూపాన్ని ఆకాశాన్ని అంటే రేంజ్‌లో చూపించిన బోయపాటి థియేటర్లలో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేశాడు. ఇక బోయపాటి కొద్దిరోజుల క్రితమే అఖండ సీక్వెల్ గా అఖండ 2 సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఇక తాజా సమాచారం ప్రకారం బోయపాటి అఖండ సీక్వెల్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటకు వదిలాడు.

Interesting Update from NBK's Akhanda Sequel Akhanda 2 ...

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న అఖండ 2 సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే బోయపాటి టీం అఖండ 2 సినిమా కోసం కసరత్తులు ఒక రేంజ్ లో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అఖండ 2 సినిమాలో పొలిటికల్ అంశాలు మెయిన్ హైలెట్‌గా ఉన్నాయట. ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. బాలయ్య చేయబోతున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.

AKHANDA 2 -Balakrishna Intro First Look Teaser|Akanda 2 Official Teaser|Balakrishna|Boyapati|ThamanS

బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు సరిపడే సరికొత్త స్టోరీ తో బోయపాటి ఈ కథను రెడీ చేస్తున్నాడట. చాలా సీన్ల‌లో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయ‌ని కూడా బోయ‌పాటి టీం కాన్ఫిడెంట్‌తో ఉందట‌. అఖండ సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బోయపాటి యంగ్ హీరో రామ్‌తో తెరకెక్కిస్తున్న సినిమా పూర్తయిన వెంటనే అకౌంటు 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.

Tags: balakrishna, balayya, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news