ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘ OG ‘ నుంచి బ్లాస్టింగ్ వీడియో… ప‌వ‌న్ కెరీర్‌లో ఫ‌స్ట్ టైం ఇలా ( వీడియో )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ప‌వ‌న్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత సాయితేజ్‌తో క‌లిసి న‌టిస్తోన్న మ‌ల్టీస్టార‌ర్ సినిమా వినోద‌య సితం సినిమా రీమేక్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప‌వ‌న్ పార్ట్ ఇప్ప‌టికే పూర్త‌య్యింది.

ఆ వెంట‌నే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ షూటింగ్ కూడా న‌డుస్తోంది. ఈ సినిమాల మ‌ధ్య‌లోనే ఇప్పుడు సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఓజీ సినిమా కూడా ఉంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ఓ బ్లాస్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వదులుతున్న‌ట్టు మేక‌ర్స్ స‌ర్కిల్స్‌లో ప్ర‌చారం జ‌రిగింది. అనుకున్న‌ట్టుగానే సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్న‌ట్టు ఓ బ్లాస్టింగ్ వీడియో వ‌దిలారు.

నిజం చెప్పాలంటే ఈ వీడియో అయితే నెక్ట్స్‌ లెవెల్లో ఉందని చెప్పాలి. ఈ సినిమా స్క్రిఫ్ట్ ను డైరెక్ట‌ర్ సుజిత్ కంప్లీట్ చేస్తున్న‌ట్టుగా ఓ ప‌వ‌ర్ ఫ్యాక్డ్ వీడియో మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోకు థ‌మ‌న్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ఈ వీడియో సినిమాను నిజంగా నెక్ట్స్ లెవ‌ల్లో ఎలివేట్ చేసింది.

వీడియోకు ఆర్ ఆర్‌, యాక్ష‌న్ ప్రాణంగా ఉండ‌బోతున్నాయ‌ని.. మ‌రోసారి సుజీత్ సాహోను మించిన స్టైల్‌గా ప‌వ‌న్‌ను ప్ర‌జెంట్ చేయ‌బోతున్న‌ట్టుగా ఉంది. ప‌వ‌న్ కెరీర్లో ఈ టైప్ స్టైలీష్ సినిమాను మ‌నం ఫ‌స్ట్ టైం చూడ‌బోతున్నాం అన్న క్లారిటీ ఈ వీడియోతో వ‌చ్చేసింది. ఈ సినిమాకు త్రిబుల్ ఆర్ నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మాత కావ‌డం విశేషం.

Tags: filmy updates, intresting news, latest news, latest viral news, Pawan kalyan, power star, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news