బిగ్ బ్రేకింగ్‌: ప‌రారీలో పుష్ప‌… పోలీసుల వేట‌.. పుష్ప 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ (వీడియో)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో చూశాం. పుష్ప మామూలు సంచ‌ల‌నాలు న‌మోదు చేయ‌లేదు. చాలా సైలెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏకంగా రు. 350 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టేసింది. ఇక నార్త్‌లో అయితే ఏకంగా రు. 100 కోట్లు కొల్ల‌గొట్టి పెద్ద షాకే ఇచ్చింది. ఈ సినిమా దెబ్బ‌తో బ‌న్నీ నేష‌న‌ల్ హీరో అయిపోయాడు.

PUSHPA 2 - First Look Motion Poster - Happy Birthday Allu Arjun #Alluarjun #Pushpa2 - YouTube

ఇప్పుడు పుష్ప సినిమాకు సీక్వ‌ల్‌గా వ‌స్తోన్న పుష్ప 2 సినిమా పై అయితే క‌నివినీ ఎరుగ‌ని రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాను వ‌చ్చే యేడాది రిలీజ్ చేయ‌నున్నారు. సినిమాకే రు. 500 కోట్ల బ‌డ్జెట్ అవుతుండ‌గా.. రు. 1000 కోట్ల టార్గెట్‌తో పుష్ప 2 బ‌రిలోకి దిగుతోంది. నేష‌న‌ల్ క్రిష్మిక ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా పై హైప్ అయితే నెక్ట్స్ లెవ‌ల్లో ఉంది.

Pushpa 2 | Official Concept Trailer | Allu Arjun | Rashmika | Sukumar | Mythri Movies | Upcoming - YouTube

ఇక ఈ రోజు ఈ సినిమా నుంచి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఊహించని వీడియోతో పాటు ఇంట్ర‌స్టింగ్ విజువల్స్ తో దీనిని రిలీజ్ చేశారు. పుష్ప రాజ్ జైలు నుంచి తప్పించుకొని పరారీలో ఉన్నాడని… అసలు పుష్ప రాజ్ ఎక్కడా అంటూ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ వీడియోలో చాలా స‌స్పెన్స్‌లు ఉన్నాయి.

అయితే దీనిపై పూర్తి క్లారిటీ ఏప్రిల్ 7న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టుగా చెప్పారు. దీంతో పుష్ప రాజ్ తిరుప‌తి జైలు నుంచి త‌ప్పించుకున్నాడ‌ని.. మ‌నోడి కోసం పోలీసులు వెతుకుతున్నార‌ని క్లారిటీ అయితే వ‌చ్చేసింది. ఏదేమైనా సుకుమార్ చాలా స‌స్పెన్స్‌లు ఈ వీడియోలో దాచాడు. ప్రి టీజర్ అయితే అదిరిపోయింద‌నే చెప్పాలి.

&;

Tags: allu arjun, film news, filmy updates, intresting news, latest news, latest viral news, Pushpa 2, pushpa 2 movie, social media, social media post, Star hero, stylish star, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news