ఈ న‌లుగురు స్టార్ హీరోయిన్ల దేశ‌భ‌క్తికి హ్యాట్సాఫ్… ఎంత గొప్ప ప‌ని చేశారంటే..!

దేశ సినీ రంగంలో ఇప్పుడంటే… హీరోయిన్లు..వ్యాపార వేత్త‌లుగా ఎదుగుతున్నారు. ఎదిగారు. కొంత సొమ్ము చేతిలో ప‌డ‌గానే హోట‌ల్ ఇండ‌స్ట్రీవైపో.. మ‌రో దానివైపో.. దృష్టి పెడుతున్నారు. అంతేకాదు.. భ‌విష్య‌త్తు కు భారీ ఎత్తున డ‌బ్బులు కూడా స‌మ‌కూర్చుకుంటున్నారు. పొరుగు దేశాల్లో ఆస్తులు కూడా కూడగ‌ట్టుకుం టున్నారు. అంతేకాదు.. రాజ‌కీయంగా ప‌దవుల కోసం పెట్టుబ‌డులు కూడా పెడుతున్నారు.

Waheeda Rehman: 'I almost didn't do Guide' - Rediff.com movies

అయితే.. ఎవ‌రి దూర‌దృష్టి వారిది.. ఎవ‌రి సొమ్ము వారిది. కాబ‌ట్టి ఎవ‌రినీ త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం కానీ, ప‌నికానీ లేదు. ఎవ‌రి క‌ష్టార్జితం వారి సొంతం. ఇక‌, ఓల్డ్‌హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే.. దేశ‌వ్యాప్తంగా.. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో మార్మోగిన పేర్లు.. అనేకం ఉన్నాయి. వహీదా రెహ‌మాన్‌, రేఖా, సావిత్రి.. ఇలా..అనేక మంది అగ్ర‌తార‌లు.. దేశంలో పేరొందారు. అయితే.. వీరు త‌మ భ‌విష్య‌త్తు గురించి పెద్ద‌గా ఆలోచ‌న చేసేవారు కాదు.

అంజలీదేవి - వికీపీడియా

దేశానికి ఏదైనా విప‌త్తు వ‌చ్చిన‌ప్పుడు.. మేమున్నామంటూ.. ముందుకు వ‌చ్చేవారు. వారికి తోచినంత కాదు.. త‌మ స్థాయికి మించి కూడా ఇచ్చిన‌వారు ఉన్నారు. వహీదా రెహ‌మాన్ ఒక సంద‌ర్భంలో బ్యాంకు నుంచి 2 కోట్ల అప్పు తీసుకుని.. తుఫాను ప్ర‌భావిత‌, వ‌ర‌ద ప్ర‌భావితం మ‌హారాష్ట్ర వాసుల‌కు.. సాయం చేశారు. ఆ అప్పును ఆమె త‌ర్వాత తీర్చుకున్నారు.

Savitri marrying Gemini Ganesan was a wrong decision, says Rajesh

సావిత్రి.. త‌న ఒంటిపై ఉన్న న‌గ‌ల‌ను నిలువు దోపిడీ ఇచ్చినట్టుగా.. చైనాతో యుద్ధం స‌మ‌యంలో దేశానికి సాయంగా అందించారు. అంజ‌లీదేవి .. దివిసీమ తుఫాను స‌మ‌యంలో రెండు సినిమాల రెమ్యూన‌రేష‌న్ ఇచ్చేశారు. అంటే.. సుమారు 8 ల‌క్ష‌లుపైగానే! ఈ విష‌యం ఎంత గోప్యంగా ఉంచారంటే.. ఎప్పుడో నాలుగే ళ్ల త‌ర్వాత కానీ.. అక్కినేని ద్వారా బ‌య‌ట‌కు రాలేదు. ఇలా.. ఓల్డ్ హీరోయిన్స్‌కు దేశం ప‌ట్ల‌.. ప్ర‌జ‌ల ప‌ట్ల భ‌క్తి… బాధ్య‌త‌లు కూడా ఉన్నాయంటే.. ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news