భార్యలను వదిలించుకోవడానికి కోట్లు ఖర్చు చేసిన హీరోలు వీళ్లే…!

పెళ్లి త‌ర‌వాత విడాకులు తీసుకుంటే భార్య‌ల‌కు భ‌ర‌ణం చెల్లించాల్సిందే. లేదంటే చ‌ట్టాలు ఒప్పుకోవు. భార్య పిల్ల‌ల మెయిన్టెనెన్స్ కోసం విడాకుల త‌ర‌వాత ఆస్తిలో భాగం ఇవ్వ‌డం కానీ లేదంటే సంపాదిస్తున్న దానిలో భాగం ఇవ్వ‌డం కానీ క‌చ్చితంగా చేయాలి. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కే కాదు ఈ రూల్స్ సెల‌బ్రెటీల‌కు కూడా వ‌ర్తిస్తాయి. ఈ నేపథ్యంలోనే కొంత‌మంది స్టార్స్ త‌మ భార్య‌ల‌ను వ‌దిలించుకునేందుకు కోట్ల‌ల్లో డ‌బ్బులు ఖ‌ర్చు చేశారు. ఆ హీరోలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం..

అక్కినేని హీరో నాగచైత‌న్య స్టార్ హీరోయిన్ స‌మంత‌ను పెళ్లి చేసుకుని ఆ త‌ర‌వాత విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా విడాకుల స‌మ‌యంలో నాగ‌చైత‌న్య స‌మంత‌కు భ‌ర‌ణం కింద కోట్ల రూపాయ‌లు చెల్లించాడ‌ని టాక్ ఉంది. అంతే కాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌టి భార్య నందినికి విడాకులు ఇచ్చి రేణూదేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు. కాగా మొద‌టి భార్య‌కు ప‌వ‌న్ కోటి రూపాయ‌ల భ‌ర‌ణం చెల్లించారు. అంతే కాకుండా ఆ త‌ర‌వాత ప‌వ‌న్ రేణూదేశాయ్ కి కూడా విడాకులు ఇచ్చారు.

ఇక రేణూ దేశాయ్ తో పాటూ ఆమె పిల్ల‌ల కోసం ప‌వ‌న్ ఆస్తిలో స‌గభాగం ఇచ్చార‌ట‌. ప్ర‌ముక కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవ కూడా ఓ హీరోయిన్ మోజులో ప‌డి భార్య‌ను వదిలించుకోవాల‌ని అనుకున్నారు. ఆయ‌న ఎవ‌రో కాదు ప్ర‌భుదేవ‌…ఇక ప్ర‌భుదేవ త‌న భార్య ర‌మాప్ర‌భ‌కు విడాకుల స‌మ‌యంలో భారీగా భ‌ర‌ణం చెల్లించుకున్నాడు. దాదాపుగా ప్ర‌భుదేవ రూ.25 కోట్ల భ‌ర‌ణం తో పాటూ ఇల్లు మ‌రియు కార్ ల‌ను కూడా భార్య పిల్ల‌ల కోసం ఇచ్చార‌ట‌.

Hrithik Roshan buys a house for ex-wife Sussanne Khan

అదేవిధంగా బాలీవుడ్ లోనూ ప‌లువురు హీరోలు త‌మ భార్య‌లకు విడాకులు ఇచ్చారు. వారిలో హృతిక్ రోష‌న్ కూడా ఒక‌రు. హృతిక్ త‌న భార్య‌కు విడాకులు ఇచ్చిన స‌మ‌యంలో కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను రాసి ఇచ్చారు. అంతేకాకుండా త‌న పిల్ల‌లు పెద్ద‌వారైన త‌ర‌వాత త‌న ఆస్తిలో కూడా వాటా క‌లిగి ఉండేలా హృతిక్ రోష‌న్ ఒప్పందం చేసుకున్నారు.

త‌మిళ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ హీరోయిన్ సారిక ఠాకూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి శృతిహాస‌న్ అక్ష‌ర హాస‌న్ లు జ‌న్మించారు. ఆ త‌ర‌వాత మ‌రొక‌రి మోజులప‌డిపోయిన క‌మ‌ల్ హాస‌న్ త‌న భార్య‌కు కోట్ల రూపాల ఆస్తులు భ‌ర‌ణంగా చెల్లించి విడాకులు తీసుకున్నారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news