ఏపీ ప్ర‌జ‌ల మూడ్ ఎందుకు మారుతోంది… మ‌ళ్లీ బాబే అని ఎందుకు అంటున్నారు..!

ఏపీ ప్ర‌జ‌ల మూడ్ మారుతోందా? ఇప్పుడు చంద్ర‌బాబు స్మ‌ర‌ణ‌లో అంద‌రూ మునిగి తేలుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నా రు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల గుంటూరులో ఒక స‌భ జ‌రిగింది. ఇది పార్టీల‌కు అతీతంగా నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మం. ఈ కార్య‌క్ర మంలో అనూహ్యంగా ప‌వ‌ర్ క‌ట్ అయింది. వెంట‌నే ఇక్క‌డ ఉన్న‌వారు.. రాజ‌కీయ ప్ర‌స్తావ‌న చేశారు. గ‌తంలో.. ఏం జ‌రిగిందంటే.. అంటూ.. కొంద‌రు వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో ప‌వ‌ర్ క‌ట్స్ ఉన్నా.. ఇప్పుడున్న రేంజ్‌లో లేవ‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు. ఇంత‌లో ఓవ్య‌క్తి లేచి.. చంద్ర‌బాబు పాల‌న‌ను వివ‌రించారు. స‌భ‌లో చ‌ప్ప‌ట్లు మోగాయి.

Nara Chandrababu Naidu biopic on the cards | Telugu Movie News - Times of India

నిజానికి ఈ కార్య‌క్ర‌మం ఉద్దేశం వేరే అయినా.. స‌భ‌లో చంద్ర‌బాబు పేరు చెప్ప‌గానే ఎక్కువ మంది చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబును ఎక్కువ మంది కోరుకుంటుండ‌డ‌మే. ఇక‌, కార్మికుల విష‌యానికి వ‌స్తే.. వారు కూడా.. చంద్ర‌బాబు పాల‌న‌ను గుర్తు చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి కార‌ణం.. ఖ‌ర్చు పెరిగిపోవ‌డం.. ఆదాయం త‌గ్గిపోవ‌డం. ఎందుకంటే.. ఇప్పుడు నిర్మాణ రంగం ఏపీలో ముందుకు సాగ‌డం లేదు. పైగా.. వ‌ల‌స‌లు కూడా పెరిగిపోయాయి. పొరుగున ఉన్న హైద‌రాబాద్‌లో ప‌నులు ఉన్నాయి త‌ప్ప‌.. ఏపీలో లేవు.

చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రంలో అమ‌రావ‌తిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగాయి. దీంతో ఎక్క‌డెక్క‌డి నుంచో పెద్ద ఎత్తున కార్మికులు ఏపీకి క్యూ క‌ట్టారు. ఏపీలో ఉన్న శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు కూడా స్థానికంగా ప‌నులు చేసుకున్నారు. నిర్మాణ‌రంగం జోరుగా ముందుకు సాగింది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. దీంతో వీరు కూడా .. చంద్ర‌బాబు రావాల‌ని కోరుకుంటున్నారు. ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తిగా ఉండాల‌ని కోరుకునేవారు 80 శాతం మంది ఉన్న‌ట్టు అంత‌ర్గ‌త టీడీపీ లెక్క‌లు చెబుతున్నాయి. సో.. వారు కూడా ఈసారి చంద్ర‌బాబు రావాల‌ని చెబుతున్నారు.

Business School, new in Amaravati to outshine all others in India by CM Shri Naidu.

అదేస‌మ‌యంలో పెట్టుబ‌డులు పెట్టేవారు..ఏపీవైపు చూడ‌డం లేదు. దీంతో ఉపాధి లేకుండా పోయింది. ఇది, యువ‌త‌ను తీవ్రంగా వేధిస్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడు ఐటీ రంగంలో పెట్టుబ‌డులు వ‌చ్చాయి. అదేవిధంగా యూనివ‌ర్సిటీలు.. విద్యాసంస్థ‌లు కూడా వ‌చ్చాయి. దీంతో చ‌దువుకున్న వారికి ఉపాధి ల‌భించింది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. ఈ ప‌రిణామాల‌తో ఇప్పుడు ఏ న‌లుగురు క‌లిసినా.. చంద్ర‌బాబు జ‌పం చేస్తున్నారు. ఆయ‌న తిరిగి ఎన్నిక కావాల‌ని కోరుతున్నారు. ఈ ప‌రిణామాలు టీడీపీలో జోష్ పెంచుతుండ‌గా.. వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp