హృతిక్ రోష‌న్ కంటే ముందే కంగ‌నా ఆ స్టార్ హీరోను ప్రేమించిందా… !

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ కంగ‌నా రనౌత్ అటు వైపు ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా.. ఎంత గొప్ప రాజ‌కీయ నాయ‌కుడు ఉన్నా కూడా ఏ మాత్రం లెక్క చేయ‌దు. సినీ, రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజంపై ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. అస‌లు ఆమె బాలీవుడ్‌లో త‌న‌కు బద్ధశత్రువులైన కరణ్ జోహార్- హృతిక్ రోషన్- ఆలియా లాంటి వారిని ఎప్పటిక‌ప్పుడు ఫుట్‌బాల్ ఆడేస్తూ ఉంట‌టుంది.

Not Hrithik Roshan but Kangana Ranaut is the WINNER in their legal spat -  Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at  Bollywoodlife.com

తాజాగా ఆమె హృతిక్ రోష‌న్ వ‌ల్లే తాను త‌న బెస్ట్ ఫ్రెండ్ లాంటి హీరోను వ‌దులుకున్నాన‌ని బాధ‌ప‌డింది. ఆ హీరో ఎవ‌రో కాదు అమీర్ ఖాన్‌? అమీర్ ఒక‌ప్పుడు త‌న‌కు మంచి స్నేహితుడు అని.. అమీర్ త‌న స్నేహంలో కెరీర్ ప‌రంగా త‌న‌కు ఎన్నో మంచి విలువైన స‌ల‌హాలు ఇచ్చాడ‌ని కంగ‌న తెలిపింది. ఇక అమీర్ త‌న‌కు మంచి మార్గ‌ద‌ర్శ‌కుడు అని.. హృతిక్ రోషన్ తనపై దావా వేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని కంగ‌న తెలిపింది.

Krrish 3 Hrithik Roshan Kangana Ranaut Kissing Stills - 6612 | 27 out of 63  | SongSuno

అమీర్‌తో త‌న స్నేహం రోజులు ఎక్క‌డికి పోయాయో అని తాను బాధ‌పడుతూ ఉంటాన‌ని కూడా కంగ‌న చెప్పింది. అమీర్ త‌న‌ను చాలాసార్లు ప్ర‌శంసించ‌డంతో పాటు ఏయే సినిమాలు ఎంపిక చేసుకోవాలో చెప్పి నా కెరీర్ బాగా తీర్చిదిద్దాడ‌ని ఆకాశానికి ఎత్తేసింది. ఇక క్రిష్ 3 సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు తాను హృతిక్‌తో రిలేష‌న్‌లో ఉన్నాన‌ని కంగ‌న తెలిపింది.

Aamir Khan praises Hrithik Roshan's Kaabil – The Orange Wall

వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌నే అంద‌రూ అనుకున్నారు. త‌ర్వాత ఏమైందో గాని గ్యాప్ వ‌చ్చేసింది. ఆ త‌ర్వాత హృతిక్‌తో త‌న రిలేష‌న్‌పై కంగ‌న ఓపెన్ అయ్యింది. హృతిక్ ఈ వివాదంలో కంగనపై దావా వేశాక ఇద్ద‌రి ఒక‌రిపై ఒక‌రు కేసులు పెట్టుకున్నారు. అయితే కంగ‌న హృతిక్‌తో ప్రేమ‌లో ప‌డ‌డానికి ముందే అమీర్‌ను పిచ్చిగా ప్రేమించింది.. అయితే అమీర్ ఆమెకు ఓ గైడ్‌గా స‌ల‌హాలు ఇచ్చాడే త‌ప్పా ఆ ఉద్దేశంతో లేడు. దీంతో కంగ‌న హృతిక్‌కు ద‌గ్గ‌రైంది.

Tags: film news, filmy updates, Hrithik Roshan, intresting news, kangana ranouth, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news