క‌మ‌ల్‌మాజీ భార్య‌, శృతీహాస‌న్ అమ్మ‌కు ఆ స్టార్ క్రికెట‌ర్‌తో బ్రేక‌ప్ అయ్యిందా ?

భారత దేశంలో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండేవి రెండే విషయాలు ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. కానీ 1987లో క్రికెట్ పైన అసలు అంచనాలే లేని సమయంలో ప్రపంచకప్ అందుకని క్రికెట్ కు గుర్తింపు తెచ్చారు కపిల్ దేవ్. భారత్ క్రికెట్ జట్టుకు తొలి ప్రపంచ కప్ అందించి అప్పటివరకు మన దేశంపై ఉన్న చిన్న చూపును చెరిపేసిన గొప్ప క్రికెటర్ కపిల్. ఆ స్థాయిలో ఎదిగిన క్రికెటర్ల పై సినిమా భామల కన్ను పడకుండా ఉంటుందా.. ? అంతేకాకుండా క్రికెట్ కు.. సినిమాలకు ఎప్పటికీ విడదీయని బంధం ఉండనే ఉంది.

Kapil Dev – Sarika love story: When the cricketer and the actress almost  tied the knot (Throwback) - IBTimes India

అలాగే కపిల్ కూడా ఒక సినీ తారతో అప్పట్లో ప్రేమలో పడ్డారు.. కానీ ఆ ప్రేమ కూడా చాలా మంది కుర్రాళ్ల‌ లవ్ స్టోరీస్ లాగే ఇది కూడా బ్రేకప్ లవ్ స్టోరీగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో క్రికెటర్స్ సినిమా తారలు ప్రేమించుకోవ‌టం, వివాహం అవ్వడం చూస్తూనే ఉన్నాం. కాని ప్రముఖ క్రికెటర్ కపిల్, కమల్ హాసన్ మాజీ భార్య అయిన సారికను ప్రేమించారన్న విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ అసలు కపిల్ – సారిక లవ్ స్టోరీ ఎలా బ్రేకప్ అయిందో ? తెలుసుకుందాము.

బాలీవుడ్ బ్యూటీ కమల్ హాసన్ మాజీ భార్య సారిక,క్రికెట‌ర్ కపిల్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సారిక కపిల్ కు పెద్ద ఫ్యాన్ కావడంతో వెటర్న్ స్టార్ మనోజ్ కుమార్ భార్య.. సారికను కపిల్ కు పరిచయం చేశారు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి తర్వాత ప్రేమగా బలపడింది. అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది అంటారు. వీరి పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటంటే సారికను కలవక ముందే కపిల్ కు రోమీతో ప్రేమాయ‌ణం నడిచింది. కానీ వారిద్దరి మధ్యలో మనస్పర్ధలు కారణంగా వారు దూరమయ్యారు.

When Kamal Haasan Allegedly Kissed Sarika In Middle Of A Store Reveals A  Fan On The Internet

అయితే సారికతో కపిల్ చనువుగా ఉండడం చూసిన రోమి ఇక లాభం లేదు అనుకుని తన పంతానికి చెక్ పెట్టేసి తన చలాకీతనంతో మళ్లీ కపిల్ కు ద‌గ్గ‌ర అయింది. రోమీ అంతగా ప్రేమించడంతో కపిల్ కూడా సారిక ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసాడు అని రోమి – కపిల్ సన్నిహితులు చెప్తూ ఉంటారు. అయితే కపిల్ రోమీల ప్రేమ గురించి తెలిసిన తర్వాత సారిగా కూడా అందులోంచి త్వరగానే కోలుకొని కమలహాసన్ తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. వారిద్దరికీ అక్షర హాసన్, శృతి హాసన్ అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ త‌ర్వాత కొన్నేళ్ల‌కు క‌మ‌ల్ సారిక‌కు విడాకులు ఇచ్చేశాడు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, sruthi haasan, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news