శాకుంత‌లం హీరో దేవ్‌మోహ‌న్‌కు, స‌మంత‌కు మ‌ధ్య అన్నేళ్లు గ్యాపా… అంత చిన్నోడుతోనూ రొమాన్స్ ఇర‌గ‌దీసిందిగా…!

స్టార్ హీరోయిన్ సమంత సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవల యశోద అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఈనెల 14న శాకుంతలం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగా తెర‌కెక్కింది. ఈ సినిమాలో దుశ్యంతుడిగా మలయాళ కుర్ర హీరో దేవ్‌ మోహన్ నటించారు. విచిత్రం ఏంటంటే దేవ్ సమంతకంటే వయసులో చిన్నోడు.. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు.

Samantha and Dev Mohan's Shaakuntalam will release on this date - News  Portal

కేరళలోని ఈ రోజు జరిగిన శాకుంతలం సినిమా ప్రమోషన్లలో అతను నిజం చెప్పేశాడు. సమంత హీరోయిన్‌గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ‌ సినిమా రిలీజ్ అయినప్పుడు తాను కాలేజీలో ఉన్నానని.. అప్పుడు థియేటర్లలో సమంతను చూశానని దేవ్‌ చెప్పాడు. ఇక తాను ఓ కంపెనీలో పని చేసేటప్పుడు ఆ కంపెనీకి సమంత బ్రాండ్ అంబాసిడర్ అని.. యాడ్ చేయటానికి వచ్చిన ఆమెను తొలిసారిగా దగ్గరుండి మరి చూశానన్నాడు.

Shaakuntalam poster: Samantha Ruth Prabhu, Dev Mohan show sparkling  chemistry - Hindustan Times

కట్ చేస్తే ఇప్పుడు సమంతతో సినిమా చేశానని… ఇది తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సంతోషకరమైన విషయం అని దేవ్‌ చెప్పాడు. ఇక నటుడుగా సమంతకంటే దేవ్ మోహన్ చాలా చాలా జూనియర్. వయసు పరంగాను ఆమె కంటే చిన్నోడు. ఇప్పుడు సమంత వయసు 36 సంవత్సరాలు. దేవ్ వయసు 30.. అంటే ఇద్దరు మధ్య ఏకంగా ఆరు ఏళ్ళు తేడా ఉంది. తనకంటే వయసులో ఆరు సంవత్సరాలు చిన్నోడుతో సమంత అదిరిపోయే రొమాన్స్ చేసింది.

దీనిపై దేవ్‌ మాట్లాడుతూ సమంత ఫిట్నెస్ అంటే ప్రాణం పెడతారు.. ఆమె జిమ్‌కు బంకు కొట్టడం అనేది ఉండదు.. అందువల్ల ఆమె వయసు పెద్దగా కనిపించదు స్క్రీన్ మీద మా ఇద్దరి జోడి చాలా చూడముచ్చటగా ఉంటుందని తెలిపాడు. ఇక దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ఈ సినిమా నిర్మించారు. దుర్వాస మహర్షిగా డాక్టర్ మోహన్ బాబు నటించ‌గా.. మ‌రో కీల‌క‌ పాత్రలో అనన్య నగళ్ళ నటించారు. పాన్‌ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న శాకుంతలం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Tags: Dev Mohan, film news, filmy updates, intresting news, latest news, latest viral news, Samantha, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news