ఆ హీరోయిన్‌ను గాఢంగా ప్రేమించిన స‌ల్మాన్‌… ఆ కార‌ణంతోనే పెళ్లి చేసుకోలేదా..!

బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. సల్మాన్ పెళ్లి వార్త ఇప్పటికి అలా వార్తల్లో ఉంటూ వస్తుంది. భాయ్‌ పెళ్లి గురించి ఏదైనా మాట్లాడితే ఆ మాటలు అలా వైరల్ అవుతూనే ఉంటాయి. సల్మాన్ వయసు 56 ఏళ్ళు.. ఇప్పటికీ మనోడు బ్యాచిలర్ గానే ఉండడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు సల్మాన్ పెళ్లిపై ఆసక్తి కనపరుస్తూనే ఉంటారు. అయితే సల్మాన్ మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. సల్మాన్ ఖాన్ ఎంతోమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపాడు అన్నది వాస్తవం.

 

ఎవరో ఎందుకు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ – సల్మాన్ కలిసి కొన్నాళ్లపాటు సహజవనం కూడా చేశారు. వారిద్దరు పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ అనుకున్నారు. సడెన్‌గా సల్మాన్ వ్యక్తిత్వంతో విసిగిపోయిన ఐశ్వర్య బ్రేకప్ చెప్పేసింది. సల్మాన్ ను ఇప్పటికీ ఇష్టపడే హీరోయిన్లు.. అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. అయితే సల్మాన్ గతంలో ఒక హీరోయిన్ ని మాత్రం బాగా ఇష్టపడ్డాడట. ఆమెని పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాడు.

అయితే ఈ విషయాన్ని ఆ హీరోయిన్ తండ్రికి చెప్పగా.. ఆయన మాత్రం నో చెప్పడంతో సల్మాన్‌, ఆ హీరోయిన్ పెళ్లి జరగలేదట. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా రాణించిన జుహీచావ్లా. ఆమె వ్యక్తిత్వం అంటే సల్మాన్ కి చాలా ఇష్టం. ఈ విషయాన్ని సల్మాన్ గతంలో పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు. జుహీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.. ఈ ప్రతిపాదన జుహీ వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకు వెళ్లాను.. నేను వాళ్లకి సరిపోనని అనుకున్నారు ఏమో (న‌వ్వుతూ) ఆయన మా పెళ్ళికి ఒప్పుకోలేదు అని సల్మాన్ తెలిపాడు.

ఈ వీడియో వైరల్ అవడంతో జుహీ కూడా స్పందించారు. పెళ్లి గురించి సల్మాన్ ఖాన్ తన తండ్రితో మాట్లాడిన విషయం నిజమే అని.. అయితే అప్పుడే సల్మాన్ కెరీర్ మొదలవడం.. అప్పటికి సల్మాన్ ఖాన్ హీరోగా నిలదొక్కుకోకపోవడంతో తన తండ్రి పెళ్లికి నో చెప్పాడని జుహీ తెలిపింది. ఇంకా జూహి మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ ప్రధాన‌పాత్రలో ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చినా.. కొన్ని కారణాలవల్ల ఆ సినిమా చేయలేకపోయానని వాపోయింది. ఈ విషయాన్ని ఇప్పటికే సల్మాన్ ఖాన్ గుర్తు చేస్తాడని జుహీ తెలిపింది.

అయితే కెరీర్ ప్రారంభంలో తమ ఇద్దరం చాలా కష్టపడ్డామని.. ఇద్దరం కలిసి స్టేజ్ షోలు కూడా చేశామని చెప్పుకొచ్చింది. 1995లో జై మెహతా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. సల్మాన్ ఖాన్ – జుహీ కలిసి 1997లో వచ్చిన దివానా మస్తానా సినిమాలో నటించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అతిథిగా కనిపించింది.

Tags: bollywood news, film news, filmy updates, intresting news, latest news, latest viral news, Salman Khan, social media, social media post, Star hero, telugu news, Tollywood, trendy news, viral news