‘ శాకుంత‌లం ‘ రివ్యూ… స‌మంత ఇలా దెబ్బేసిందేంటి…!

స‌మంత – దేవ్‌మోహ‌న్ జంట‌గా తెర‌కెక్కిన సినిమా శాకుత‌లం. ఈ సినిమా మైథ‌లాజిక‌ల్ క‌థాంశంతో తెర‌కెక్కింది. ప్ర‌పంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవ‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోలు కూడా కంప్లీట్ చేసుకుంది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో ప్రీమియ‌ర్ల రిపోర్టు ద్వారా తెలుసుకుందాం. ముందుగా క‌థ‌లోకి వెళితే విశ్వామిత్రుడి త‌పోభంగం కోసం భూమి మీద‌కు వ‌చ్చిన దేవ క‌న్య మేన‌క (మ‌ధుబాల‌) కాగా… వీరి ప్రేమ‌కు గుర్తుకు పుట్టిన ఓ పాప‌ను దేవలోకం తీసుకెళ్ల‌లేక మేన‌క భూమ్మీద‌నే విడిచి పెడుతుంది.

Shaakuntalam Mp3 Songs Download - AtoZmp3

అయితే ఆ పాప‌ను చూసిన శాకుంతలం పక్షులు ఆ పాప‌ను కణ్వ మ‌హ‌ర్షి (సచిన్ ఖేడేక‌ర్‌) ఆశ్ర‌మానికి తీసుకువెళ‌తాయి. క‌ణ్వ మ‌హ‌ర్షి ఆ పాప‌కు శ‌కుంత‌ల అనే పేరు పెడ‌తాడు మ‌హ‌ర్షి. ఆ ఆశ్ర‌మంలోనే ఆమె పెరిగి పెద్ద‌ద‌వుతూ ఉంటుంది. కొన్నేళ్ల‌కు రాజ్యంలోని ప్ర‌జ‌ల‌ను, క్రూర మృగాల బారి నుంచి కాపాడే ప్ర‌య‌త్నంలో దుష్యంత మ‌హారాజు (దేవ్ మోహ‌న్‌) క‌ణ్వ మ‌హ‌ర్షి ఆశ్ర‌మంలోకి వెళ్లి.. అక్క‌డ శకుంత‌ల ( స‌మంత‌)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కూడా మ‌హారాజు ప్రేమ‌లో ప‌డిపోగా… ఇద్ద‌రూ గాంధ‌ర్వ వివాహంతో ఒక్క‌ట‌వుతారు.

Samantha Shakuntalam Movie Hd Poster 002 - Kerala9.com

ఆ త‌ర్వాత దుష్యంతుడు త‌న రాజ్యానికి వెళ్లి త్వ‌ర‌లోనే తిరిగి వ‌చ్చి ప‌ట్ట మ‌హిషిగా ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తాన‌ని శ‌కుంత‌ల‌కు మాటిస్తాడు. తాను ఆమెను ప్రేమించినందుకు గుర్తుగా త‌న ఉంగ‌రాన్నిస్తాడు. ఆ త‌ర్వాత క‌ణ్వ మ‌హ‌ర్షి ఆశ్ర‌మానికి దుర్వాస మ‌హా ముని(మోహ‌న్‌బాబు) వస్తాడు. అప్ప‌టికే గ‌ర్భ‌వ‌తి అయిన శ‌కుంత‌ల‌ భ‌ర్త రాక కోసం ఎదురు చూస్తూ దుర్వాస మ‌హాముని రాక‌ను గుర్తించ‌దు. దీంతో దుర్వాసుడు భ‌ర్త ఆమెను మర్చిపోతాడ‌ని శ‌పించి వెళ్లిపోతాడు.

Samantha's 'Shaakuntalam' gets a new release date - The Hindu

దీంతో ఆమె భ‌ర్త కోసం దుష్యంతుడు ద‌గ్గ‌రికి వెళ్లినా శాపం కార‌ణంగా ఆమెను భ‌ర్త దుష్యంతుడు గుర్తించ‌డు. ఆమెకు కొలువులో అవ‌మానం జ‌రుగుతుంది. దుష్యంతుడు, శ‌కుంత‌ల క‌ల‌వ‌కూడ‌దనుకుని అసురులు ఉగ్ర‌నేమీ, కాల‌నీములు కుట్ర‌లు ప‌న్నుతారు. చివ‌ర‌కు దుష్యంతుడు, శ‌కుంత‌ల ఎలా ? ఒక్క‌ట‌య్యారు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

ఇక శ‌కుంత‌ల పాత్ర‌లో స‌మంత ఒదిగిపోయే ప్ర‌య‌త్నం చేసినా ఎందుక‌నో అది న‌ప్ప‌లేదు. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ లుక్ గుడ్‌. దుర్వాసుడిగా మోహ‌న్ బాబు కొద్ది సేపే క‌నిపించినా త‌న‌దైన మార్క్ న‌ట‌న చూపించారు. స‌చిన్ ఖేడేక‌ర్‌, జిస్సు సేన్ గుప్తా, అన‌న్య నాగ‌ళ్ల‌, గౌత‌మి త‌దిత‌రులు వారి పాత్రల ప‌రిధుల వ‌ర‌కు మెప్పించారు. సినిమాలు విజువ‌ల్స్ తేలిపోయాయి. కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ మ‌రీ నాశిర‌కంగా ఉన్నాయి. స్క్రీన్ ప్లేతో గుణ‌శేఖ‌ర్ మ్యాజిక్ చేయ‌లేదు. కేవ‌లం క‌థ‌, స‌మంత మాత్ర‌మే ఈ సినిమాను ఎంత వ‌ర‌కు కాపాడ‌తాయో ? చూడాలి.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, sakunthalam, Samantha, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news